Begin typing your search above and press return to search.

ఆ తెలుగు డైరెక్టర్లంతా ఏమయ్యారు? కొత్త ప్రాజెక్టులు ఇంకెప్పుడు?

ఇప్పటికే కొన్ని హిట్స్ ను సాధించినా.. ప్రస్తుతం ఛాన్స్ లు లేక చాలా మంది టాలీవుడ్ సినీ దర్శకులు ఫుల్ సైలెంట్ గా ఉన్నారు.

By:  M Prashanth   |   14 Aug 2025 11:45 AM IST
ఆ తెలుగు డైరెక్టర్లంతా ఏమయ్యారు? కొత్త ప్రాజెక్టులు ఇంకెప్పుడు?
X

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి లక్ ఎలా ఉంటుందో తెలియదు. ముఖ్యంగా డైరెక్టర్స్ ది. ఎందుకంటే కొందరు డెబ్యూతో హిట్ కొట్టి.. ఆ తర్వాత దూసుకుపోతారు. మరికొందరు స్టార్టింగ్ లో తమ డైరెక్షన్ తో నిరాశపరిచినా.. ఆ తర్వాత మెల్లగా ట్రాక్ లోకి వస్తారు. అయితే ఇంకొందరు మాత్రం తమ సినిమాల రిజల్ట్ తో కనుమరుగువుతారు!

ఇప్పటికే కొన్ని హిట్స్ ను సాధించినా.. ప్రస్తుతం ఛాన్స్ లు లేక చాలా మంది టాలీవుడ్ సినీ దర్శకులు ఫుల్ సైలెంట్ గా ఉన్నారు. వారి చివరి సినిమా వచ్చి చాలా నెలలు అవుతున్నా.. కొత్త ప్రాజెక్టులను అనౌన్స్ చేయడం లేదు. ఏం చేస్తున్నారో కూడా బయటకు తెలియడం లేదు. మరి ఆ డైరెక్టర్స్ ఎవరు? ఏం చేస్తున్నారు?

డైరెక్టర్ పరశురామ్.. గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మంచి క్రేజ్ కూడా సంపాదించుకున్నారు. కానీ రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచారు. భారీగా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఏడాది దాటినా కొత్త సినిమా అనౌన్స్ చేయడం లేదు. ఎలాంటి వార్తలు కూడా రావడం లేదు.

ఖుషీ మూవీ తర్వాత శివ నిర్వాణ, ఇప్పటి వరకు మరో సినిమా ప్రకటించలేదు. నాగ చైతన్యతో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చినా, ఇప్పటివరకు ప్రకటన రాలేదు. మరోవైపు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌తో తిరిగి పుంజుకున్న తర్వాత బొమ్మరిల్లు బాస్కర్ రీసెంట్ గా జాక్‌ మూవీ తీశారు. కానీ నిరాశపరిచారు. ప్రస్తుతానికి ఏ ప్రాజెక్ట్ను ప్రకటించలేదు.

టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చివరగా పెదకాపు మూవీ తీశారు. కానీ అనుకున్న స్థాయిలో ఆడియన్స్ను మెప్పించలేకపోయారు. ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన వివిధ సినిమాలు ఆడియన్స్ను ఆకట్టుకున్నప్పటికీ.. ఇప్పుడు ఆయనకు అవకాశాలు కరువయ్యాయి.

లక్కీ డైరెక్టర్గా పేరు పొందిన శ్రీరామ్ ఆదిత్య.. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ హిట్స్ అందుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆయన లైనప్లో ఒక్క మూవీ కూడా లేదు. మరోవైపు, శశి కిరణ్ తిక్క గూడచారి, మేజర్ చిత్రాలతో మెప్పించారు. రీసెంట్గా సత్యభామతో నిరాశపరిచారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నారు.

కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ నా సామి రంగ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి హిట్ అందుకున్నారు. కానీ ఇప్పుడు మరో సినిమాను ప్రకటించలేదు. నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల డైరెక్టర్గా కొత్త ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. యాత్ర 2 తర్వాత, మహి వి రాఘవ్ ఇంకా తన తదుపరి సినిమాను ప్రకటించలేదు.

ఒకప్పుడు అగ్ర రచయిత అయిన వీరు పోట్ల.. బిందాస్, రగడ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కానీ ఆ తర్వాత సరైన హిట్స్ ను సొంతం చేసుకోలేకపోయారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో చర్చలు జరిపినా.. వర్కౌట్ కాలేదు. మొత్తానికి వీరంతా ఛాన్స్ ల కోసం వెయిట్ చేస్తున్నారు. మరెప్పుడు కొత్త చిత్రాలు ప్రకటిస్తారో వేచి చూడాలి.