Begin typing your search above and press return to search.

గ్యాప్ తర్వాత కమ్‌బ్యాక్ & కొత్త దర్శకుల నిరీక్షణ!

పవన్ సాధినేని, తరుణ్ భాస్కర్ విరామం తర్వాత తమ సినిమాలతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. రవికిరణ్ కోలా ‘రౌడీ జనార్ధన’, మురళీకాంత్ దేవసోత్ ‘అలియాస్ రుక్మిణి’తో సిద్ధమవుతున్నారు. ఈ నలుగురు దర్శకులు విజయాలు సాధిస్తే, సరైన కథలు, దర్శకుల కోసం ఎదురుచూస్తున్న టైర్-2 హీరోలకు కొత్త అవకాశాలు లభించనున్నాయి.

By:  Srikanth Kontham   |   21 Nov 2026 3:21 PM IST
గ్యాప్ తర్వాత కమ్‌బ్యాక్ & కొత్త దర్శకుల నిరీక్షణ!
X

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ట్యాలెంటెడ్ దర్శకుల మధ్య ఆసక్తికరమైన పోటీ కనిపిస్తోంది. కొందరు దర్శకులు సుదీర్ఘ విరామం తర్వాత తమ మార్క్ సినిమాలతో మళ్లీ బాక్సాఫీస్ వేట మొదలుపెడితే.. మరికొందరు తదుపరి ప్రాజెక్టు లతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కంటెంట్ ఉన్న సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్లు అంతా కీలక దశలో ఉన్నారు. వారి సినిమాలు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తాయనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.

పవన్ సాధినేని విషయానికొస్తే చాలా గ్యాప్ తర్వాత `ఆకాశంలో ఒక తార` అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఎమోషనల్ డ్రామాలను తనదైన శైలిలో తెరకెక్కించడంలో దిట్ట అయిన పవన్ ఈ సినిమాతో మళ్లీ తన ముద్ర వేశారు. విరామం తర్వాత వచ్చినా కథ చెప్పే విధానంలో ఏమాత్రం తడబాటు లేకుండా ఆకట్టుకున్నారు. ఈ చిత్రం ఆయన కెరీర్‌కు మళ్లీ కొత్త ఊపునిచ్చిందనే చెప్పాలి.

మరోవైపు యూత్‌ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన తరుణ్ భాస్కర్ `ఈ నగరానికి ఏమైంది రిపీట్` చిత్రంతో విరామం తర్వాత థియేటర్లలో సందడి చేశారు. మొదటి భాగం సృష్టించిన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సీక్వెల్‌ను మలిచారు. తన మార్క్ సహజమైన కామెడీ.. ఫ్రెండ్‌షిప్ ఎమోషన్స్‌తో మళ్లీ పాత రోజులను గుర్తుచేశారు. గ్యాప్ వచ్చినా తన రైటింగ్ పవర్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నారు.

ఇక కొత్త తరం దర్శకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవికిరణ్ కోలా `రౌడీ జనార్ధన` చిత్రంతో సిద్ధమవుతున్నారు. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు ఈసారి పక్కా మాస్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ఆయన టేకింగ్ ఎలా ఉంటుంద‌ని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అలాగే వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే మురళీకాంత్ దేవసోత్ కూడా తదుపరి చిత్రం `అలియాస్ రుక్మిణి` తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదటి సినిమాతోనే తన ఆలోచనా విధానాన్ని చాటుకున్న ఆయన ఈసారి మరింత బలమైన కథాంశాన్ని సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ రెండు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో న‌లుగురు ద‌ర్శ‌కులు స‌క్సెస్ అయితే? యువ హీరోల‌కు స‌రైన ద‌ర్శ‌కులు దొరికిన‌ట్లే.టైర్ 2 హీరోలంతా పాన్ ఇండియా క‌థ‌ల కోసం అల్లాడిపోతున్న సంగ‌తి తెలిసిందే. ర‌క‌ర‌కాల రైట‌ర్లు క‌థ‌లు వినిపిస్తున్నా? న‌చ్చ‌క‌పోవ‌డంతో ముందుకు రావ‌డం లేదు. కొన్ని క‌థ‌లు న‌చ్చినా ద‌ర్శ‌కుడు సెట్ కాక‌పోవ‌డంతో ధైర్యం చేయ‌లేక‌పోతున్నారు. అదే ఒక స‌క్సెస్ పుల్ ద‌ర్శ‌కుడి ద్వారా స్టోరీ వెళ్తే అక్క‌డ హీరోల వెర్ష‌న్ మ‌రోలా ఉంటుంద‌న్న‌ది కాద‌న‌లేని నిజం.