దమ్ము సరిపోవడం లేదా? ఛాన్స్ రావడం లేదా?
టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
By: Srikanth Kontham | 16 July 2026 5:00 PM ISTటాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. లోకేష్ కనగరాజ్, బాసిల్ జోసెఫ్, వెట్రీమారన్ వంటి క్రేజీ డైరెక్టర్ల వైపు వారి చూపు ఉండటం సహజం. అయితే ఈ క్రమంలో టాలీవుడ్‌లోనే ఉన్న అద్భుతమైన ప్రతిభ గల పాన్ ఇండియా దర్శకులను కూడా వారు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్టార్ హీరోలకు సరిపోయే కంటెంట్‌ను రూపొందించే సత్తా ఇక్కడి దర్శకులకు కూడా పుష్కలంగా ఉంది.
నిజానికి ఒక అగ్ర కథానాయకుడిని ఒప్పించాలంటే? దర్శకుడి కథలో దమ్ము ఉండాలి. స్టార్ హీరోల ఇమేజ్‌ను మించి వారి నటనకు కొత్త కోణాలను ఆవిష్కరించే కథాబలం అవసరం. లోకేష్ కనగరాజ్ వెట్రీమారన్ వంటి దర్శకులు తమకంటూ ప్రత్యేక శైలిని ఎలా సృష్టించుకున్నారో? తెలుగు దర్శకులు కూడా అలాంటి వినూత్నమైన సిగ్నేచర్ మేకింగ్‌ను ప్రదర్శించాలి. ఆ నమ్మకాన్ని కలిగించే స్థాయిలో కథా చర్చలు జరగాలి.
స్టార్ హీరోలు అపాయింట్‌మెంట్ ఇచ్చేలా దర్శకులు తమను తాము మలచుకోవడంలో ఎక్కడో ఒక చిన్న అడుగు వెనుకబడుతున్నారా? అనే అనుమానం లేకపోలేదు. కేవలం ఒక స్టార్ హీరోతో సినిమా చేయడం లక్ష్యంగా పెట్టుకోకుండా? తమ కథను ప్రపంచ స్థాయి ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దే సంకల్పం ఉండాలి. హీరోలకు కావాల్సింది భారీ బడ్జెట్ కంటే? వారి కెరీర్‌లో గుర్తుండిపోయే బలమైన కథ. దర్శకుడు ఆ విశ్వాసాన్ని హీరోలో కలిగించినప్పుడే అపాయింట్‌మెంట్‌లు సాధ్యమవుతాయి.
టాలీవుడ్ దర్శకులు తమ పరిధిని దాటి ఆలోచించి గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా స్క్రిప్ట్ వర్క్ చేయడం అత్యవసరం. అలా ముగ్గురు నలుగురు దర్శకులు మాత్రమే చేయగల్గుతున్నారు. ఇంకొంత మంది ట్యాలెంట్ ఉన్నా? అవకాశాలు కోసం ఎదురు చూస్తున్నారు. మరికొంత మందికి అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేక వెనుక బడుతున్నారు. సౌత్ ఇండియాలో జరుగుతున్న మార్పులను గమనిస్తే కథా బలమే విజయాన్ని నిర్ణయిస్తుందని స్పష్టమవుతోంది. హీరోలు కూడా బయటి రాష్ట్రాల దర్శకులను కోరుకోవడం వెనుక ఆయా దర్శకుల పట్ల ఉన్న నమ్మకం ప్రధాన కారణం. ఇదే నమ్మకాన్ని తెలుగు దర్శకులు కూడా ఆర్జించుకోవాలి.
సరైన కథ దొరికితే? ఇక్కడి హీరోలు కూడా కచ్చితంగా లోకల్ దర్శకులకు అవకాశం ఇస్తారు. గతంలో రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు కాబట్టే నేడు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. భవిష్యత్తులో కొత్త తరం దర్శకులు తమ దమ్ము తో స్టార్ హీరోలను ఒప్పించి అద్భుతమైన ప్రాజెక్టులను పట్టాలెక్కించడం ద్వారా టాలీవుడ్ స్థాయిని మరింత పెంచాలి.
సృజనాత్మకతకు -స్టార్‌డమ్‌కు మధ్య ఉన్న అగాధాన్ని తగ్గించాల్సింది దర్శకులే. తమ కథలోని లోతు, మేకింగ్‌లోని స్పష్టత హీరోలకు కనెక్ట్ అయిన నాడు భాషా భేదాలు లేకుండా భారీ ప్రాజెక్టులు తెలుగులోనే రూపుదిద్దుకుంటాయి. ప్రతిభకు సరైన వేదిక దొరికితే? టాలీవుడ్ దర్శకులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటగలరు.
