Begin typing your search above and press return to search.

దర్శకుల సుదీర్ఘ విరామం - హీరోలపై పడుతోన్న ప్రభావం!

టాలీవుడ్ లీడింగ్ డైరెక్టర్లయిన శేఖర్ కమ్ముల, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ వంటి దర్శకులు కూడా ఇదే తరహాలో నెమ్మదించారు.

By:  Srikanth Kontham   |   19 May 2026 9:00 PM IST
దర్శకుల సుదీర్ఘ విరామం - హీరోలపై పడుతోన్న ప్రభావం!
X

ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమ గ్లోబల్ స్థాయిలో రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. భారీ బడ్జెట్ సినిమాలు, పాన్-ఇండియా ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వంద‌ల కోట్ల వ్యాపారం జరుగుతోంది. అయితే ఈ భారీతనం వెనుక సరికొత్త సవాల్ ఇండస్ట్రీని వేధిస్తోంది. అదే టాలీవుడ్ అగ్ర దర్శకుల సుదీర్ఘ విరామం. ఒకప్పుడు ఏడాదికి రెండు సినిమాలు తీసిన క్రేజీ డైరెక్టర్లు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ముగిసిన తర్వాత తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించడానికి కనీసం రెండు నుండి మూడేళ్ల వరకు సమయం తీసుకుంటున్నారు. ఈ నెమ్మదైన ధోరణి పరిశ్రమపై ముఖ్యంగా హీరోల కెరీర్ ప్లానింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోందన్న‌ది కాద‌న‌లేని నిజం.

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గురించి. ఆయన దర్శకత్వంలో వచ్చిన `ఆర్ఆర్ఆర్` సృష్టించిన అంతర్జాతీయ సంచలనం అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా విడుదలైన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు వార‌ణాసి సెట్స్ పైకి వెళ్లడానికి మూడేళ్లకు పైగా సుదీర్ఘ సమయం పట్టింది. జక్కన్న చెక్కుడు ఇండస్ట్రీకి ముందే తెలిసినా? ఓ టాప్ హీరో కెరీర్‌లో అత్యంత కీలకమైన మూడు సంవత్సరాల సమయం కొంత క‌ల‌వ‌ర‌పెడుతున్నా? అదే సినిమా హిట్ అయితే వ‌చ్చే గుర్తింపును ఊహించుకుంటే? గ్యాప్ ది ఏముందిలే అనిపిస్తుంది. ఇంత గ్యాప్ కి కార‌ణం. ప్రీ-ప్రొడక్షన్- వర్క్‌వుట్స్ స్క్రిప్ట్ చర్చలకు ఎక్కువ కేటాయించ‌డంతో పాటు షూటింగ్ డిలే అన్న‌ది తెలిసిందే.

మరోవైపు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. `పుష్ప: ది రూల్` చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయి అవుట్‌పుట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సుకుమార్ ఆ తర్వాత తదుపరి సినిమాను ఇంకా పట్టాలెక్కించలేదు. పుష్ప 2 రిలీజ్ అయిన ఏడాదిన్న దాటింది. చ‌ర‌ణ్ తో సినిమా చేయాల్సి ఉంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా మొద‌ల‌వుతుంది. ఒక భారీ చిత్రం ముగిసిన వెంటనే కథపై మళ్లీ సుదీర్ఘంగా కసరత్తు చేయడం , హీరోల కాల్షీట్లు ,ప్రొడక్షన్ హౌస్‌ల ప్లానింగ్స్ పూర్తిగా మారిపోతున్నాయి. ఈ గ్యాప్స్ వల్ల సినిమా- సినిమాకు మధ్య స్టార్ హీరోల ఏజ్ ఫ్యాక్టర్ , లుక్స్ కూడా ప్రభావితం అవుతున్నాయి. దీంతో హీరోలు లుక్ తీసుకురావ‌డం అద‌నంగా స‌మ‌యం కేటాయించాల్సి వస్తోంది. దీంతో మ‌రికొంత గ్యాప్ త‌ప్ప‌డం లేదు.

టాలీవుడ్ లీడింగ్ డైరెక్టర్లయిన శేఖర్ కమ్ముల, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ వంటి దర్శకులు కూడా ఇదే తరహాలో నెమ్మదించారు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన దర్శకులు.. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు, పాన్-ఇండియా మార్కెట్ ఒత్తిడి కారణంగా స్క్రిప్ట్ వర్క్ కే ఏడాదికి పైగా సమయం కేటాయిస్తున్నారు. `లైగర్` లేదా `గుంటూరు కారం` వంటి క్రేజీ చిత్రాల తర్వాత సదరు దర్శకులు తదుపరి చిత్రాలను అనౌన్స్ చేయడానికి వాటి షూటింగ్స్ ప్రారంభించడానికి ఎంత గ్యాప్ తీసుకున్నారో? తెలిసిందే. దీంతో లాంగ్ గ్యాప్ ఇండస్ట్రీ రీసెర్చ్ లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుల సుదీర్ఘ విరామం వల్ల అంతిమంగా నష్టపోయేది స్టార్ హీరోలే అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.