డిసెంబర్ లో దమ్ము చూపించేందుకు వచ్చేస్తున్నారు..!
దసరా ఫైట్ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి డిసెంబర్ లో వరుస సినిమాలు వస్తున్నాయి.
By: Ramesh Boddu | 17 Oct 2025 10:15 AM ISTదసరా ఫైట్ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి డిసెంబర్ లో వరుస సినిమాలు వస్తున్నాయి. అందులో కొన్ని క్రేజీ సినిమాలు ఉన్నాయి. డిసెంబర్ 5న బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 భారీ అంచనాలతో వస్తుంది. అఖండ తర్వాత ఈ కాంబినేషన్ లో ఆ సినిమా కన్నా భారీ ప్లానింగ్ తో అఖండ 2 తాండవం వస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
క్రిస్మస్ టార్గెట్ తో రెండు సినిమాలు..
అఖండ 2 వచ్చిన వారం తర్వాత యువ హీరో రోషన్ కనకాల మోగ్లీ వస్తుంది. కలర్ ఫోటో తర్వాత సందీప్ రాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఇది. ప్రమోషన్స్ అయితే ఇంప్రెస్ చేస్తున్నాయి. మోగ్లీ సినిమా డిసెంబర్ రెండో వారం అంటే 12న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత రెండు వారాల గ్యాప్ తో డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ టార్గెట్ తో రెండు సినిమాలు వస్తున్నాయి. అందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా వస్తున్న ఛాంపియన్ ఒకటి ఉంది.
రోషన్ హీరోగా పెళ్లిసందడి వచ్చింది. ఆ సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని ఛాంపియన్ చేస్తున్నాడు. ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. డిసెంబర్ 25న ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. వైజయంతి, స్వప్నా సినిమాస్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. రోషన్ మీద నిర్మాతలు భారీగానే ఖర్చు పెట్టారని టాక్.
అనుదీప్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్..
ఇక డిసెంబర్ 25 క్రిస్మస్ కి ఫంకీతో వస్తున్నాడు విశ్వక్ సేన్. జాతిరత్నాలు, ప్రిన్స్ తర్వాత డైరెక్టర్ అనుదీప్ కెవి డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. రీసెంట్ గా రిలీజైన ఫంకీ టీజర్ ఇంప్రెస్ చేసింది. అనుదీప్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుంది. ఫంకీ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె కూడా సినిమాకు హైలెట్ అవనుంది.
సో డిసెంబర్ 25న క్రిస్మస్ కి ఫంకీ ఎంటర్టైన్ చేయబోతున్నాడు. డిసెంబర్ లో స్ట్రైట్ తెలుగు సినిమాలైతే ఈ నాలుగు వస్తున్నాయి. ఇంకా ఇవి కాకుండా డబ్బింగ్ సినిమాల రిలీజ్ లు ఉండనే ఉంటాయి. తెలుగు మార్కెట్ పై డబ్బింగ్ సినిమాల ఎఫెక్ట్ తెలిసిందే. మరి క్రిస్మస్ కి ఏ డబ్బింగ్ సినిమా వస్తుందో చూడాలి.
ప్రస్తుతానికైతే ఎలాంటి అప్డేట్ రాలేదు. తమిళ సినిమాలు చాలా సినిమాలు క్యూలైన్ లో ఉన్నాయి. సూర్య కరుప్పు, కార్తీ వా వాతియార్ తో పాటు రవి మోహన్ జినీ ఇలా వరుస సినిమాలు ఉన్నాయి. ఇవి తెలుగులో కూడా మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రదీప్ రంగనాథ్ ఎల్.ఐ.కె కూడా డిసెంబర్ రిలీజ్ ఉంటుంది. డ్యూడ్ సక్సెస్ అయితే ఆ సినిమాకు తెలుగులో మంచి రిలీజ్ దొరికే ఛాన్స్ ఉంటుంది.
