2018 Vs 2026 డైరెక్టర్స్ ఫైట్.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
టాలీవుడ్‌లో 2018వ సంవత్సరం ఒక మ్యాజిక్ లాంటిది. ఆ ఏడాది ఎందరో యంగ్ డైరెక్టర్లు 'మహానటి', 'రంగస్థలం', 'గీత గోవిందం', 'టాక్సీవాలా' వంటి ఇండస్ట్రీ హిట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు.
By: Madhu Reddy | 23 Jun 2026 7:00 PM ISTటాలీవుడ్‌లో 2018వ సంవత్సరం ఒక మ్యాజిక్ లాంటిది. ఆ ఏడాది ఎందరో యంగ్ డైరెక్టర్లు 'మహానటి', 'రంగస్థలం', 'గీత గోవిందం', 'టాక్సీవాలా' వంటి ఇండస్ట్రీ హిట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. మళ్లీ ఇప్పుడు 2026లో అదే డైరెక్టర్లు, స్టార్ హీరోలు, సరికొత్త క్రేజీ ప్రాజెక్టులతో థియేటర్లలో రచ్చ లేపడానికి సిద్ధమయ్యారు. అప్పుడు క్రియేట్ చేసిన హిస్టరీని వీరంతా ఈ ఏడాది కూడా రిపీట్ చేస్తారని ఆడియన్స్ గట్టిగా నమ్ముతున్నారు.
విజయ్ - రష్మిక 'రణబాలి':
2018లో 'టాక్సీవాలా'తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్.. 2026లో విజయ్ దేవరకొండతో కలిసి 'రణబాలి' అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామాను తెస్తున్నాడు. 1870ల కాలం నాటి కథతో వస్తున్న ఈ సినిమాలో మరో బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ ఉంది. 2018లో 'గీత గోవిందం'తో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఈ ఏడాది రియల్ లైఫ్‌లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వివాహం తర్వాత ఈ క్రేజీ కపుల్ నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
బాక్సాఫీస్ కొల్లగొట్టిన 'పెద్ది':
2018లో రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. ఇక 2026లో సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' మూవీతో చరణ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర చేశాడు. ఇక బుచ్చిబాబు సన డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆల్రెడీ థియేటర్లలో సూపర్ హిట్ టాక్‌తో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
'రావ్ బహదూర్'.. 'భోగి'తో వస్తున్న మేకర్స్:
2018లో 'కేరాఫ్ కంచెరపాలెం' లాంటి సెన్సేషనల్ ఇండీ ఫిల్మ్‌తో మెప్పించిన వెంకటేష్ మహా.. ఇప్పుడు సత్యదేవ్ హీరోగా 'రావ్ బహదూర్' అనే సరికొత్త సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇక మరోవైపు, 2018లో 'పేపర్ బాయ్' చిత్రానికి కథ అందించి నిర్మాతగా సక్సెస్ అయిన డైరెక్టర్ సంపత్ నంది.. ఈ ఏడాది శర్వానంద్ హీరోగా 'భోగి' అనే పల్సేటింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామాను ఆగస్టులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
అలాగే 2018లో 'మహానటి'తో క్లాసిక్ హిట్ ఇచ్చిన నాగ్ అశ్విన్ కూడా సింగ్ గీతం తో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు..
ఒక రకంగా చెప్పాలంటే 2018 నాటి బ్లాక్‌బస్టర్ కాంబినేషన్లు అన్నీ 2026లో సరికొత్త అవతారాల్లో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఇక విజయ్-రష్మికల 'రణబాళి', చరణ్ 'పెద్ది' సక్సెస్, శర్వానంద్ 'భోగి'.. ఇలా ప్రతి ఒక్కటీ ప్రేక్షకులలో విపరీతమైన కుతూహలాన్ని కలిగిస్తున్నాయి. మరి 2018 నాటి సెంటిమెంట్ రిపీట్ అయి.. ఈ క్రేజీ కాంబోలన్నీ 2026లో కూడా టాలీవుడ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తాయో లేదో చూడాలి.
