ఆ స్టార్ హీరో కూడా మంచి వంటగాడే!
సోలో లైఫ్ లో ఉన్న ఈ బ్యాచిలర్ ఈ వంట అన్నది మంచి టైంపాస్ గానూ భావిస్తానన్నారు.
By: Sivaji Kontham | 30 Oct 2025 6:00 AM ISTస్టార్ హీరోల్లో మంచి వంటగాడు ఎవరు? అంటే అందరూ చెప్పేది యంగ్ టైగర్ ఎన్టీఆర్. తారక్ మంచి నాన్ వెజ్ ప్రియుడు కావడంతో? ఆ తరహా వంటకాలు బాగా చేస్తారు. ప్రత్యేకించి చికెన్ బిర్యానీ చేయడంలో తానో స్పెషలిస్ట్ అని చెప్పాల్సిని పనిలేదు. ప్రభాస్ కేవలం ఆరగించడం వరకే. ఆయన కూడా నాన్ వెజ్ ప్రియుడు. ఏ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి? అన్నది తన మాస్టర్ కి చెప్పి తయారు చేయించుకోవడం డార్లింగ్ ప్రత్యేకత. అలాగే యువ సామ్రాట్ నాగచైతన్య కూడా స్పెషలిస్ట్. సొంతంగా క్లౌడ్ కిచెన్ కూడా రన్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
మంచి నాన్ వెజ్ ప్రియుడు:
విదేశీ వంటకాలు అమితంగా ఇష్టడతాడు. ఇందులో చై మాస్టర్ అనొచ్చు. తన స్టాప్ తో రకరకాల వంటకాలు వండిస్తుంటారు. నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్లు అప్పుడప్పుడు గరిట పడుతుంటారు. ఇంకా తవ్వితే చాలా మంది స్టార్ల పేర్లు వస్తాయి. వాళ్ల సంగతేమోగానీ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా మంచి వంటగాడు అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సల్మాన్ మంచి నాన్న వెజ్ ప్రియుడు అని అందరికీ తెలుసు. ముక్క లేనిదే ముద్ద దిగని టైపు. ఇప్పటికీ అంతే ఫిట్ గా ఉంటున్నాడు? అంటే కారణం జిమ్ ఒక్కటే కాదు.
వారం లో రెండు రోజులు తానే స్వయంగా:
రకరకాల నాన్ వెజ్ వంటకాలు తినడంతోనూ సాధ్యమవుతుంది. చికెన్..మటన్ ...ఫిష్ మాత్రమే కాదు. యేట కూరలు తినడంలో తాను స్పెషలిస్ట్. అంతే కాదు వాటిని తానే స్వయంగా ప్రిపేర్ చేసుకుంటారుట. ఎలాంటి షూటింగ్ లు లేకపోతే? కిచెన్ రూమ్ లోకి వెళ్లి అప్పటికప్పుడు ఏది తినాలనిపిస్తే అది తాను సొంతంగా తయారు చేస్తారుట. నాన్ వెజ్ వంటకాలు మాత్రం మరింత ఇంట్రెస్ట్ గా ప్రిపేర్ చేస్తారుట. వారంలో రెండుసార్లు తానే స్వయంగతా తయారు చేస్తారుట. వాటిని తన తల్లికి వడ్డించడం కూడా ఎంతో ఇష్టంగా భావిస్తానన్నారు.
షూటింగ్ తో బిజీగా:
సోలో లైఫ్ లో ఉన్న ఈ బ్యాచిలర్ ఈ వంట అన్నది మంచి టైంపాస్ గానూ భావిస్తానన్నారు. ఇక సల్మాన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం `బ్యాటిల్ ఆప్ గాల్వానా`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రాంతానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు పాత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. గాల్వానా ఘటనలో సంతోష్ బాబు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఇందులో వీర్ సింగ్ పాత్రలో సల్మాన్ కనిపించనున్నారు. సల్మాన్ గత సినిమా `సికిందర్` భారీ అంచనాల మధ్య విడుదలై ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.
