Begin typing your search above and press return to search.

ఖాళీ లేక కాదు క‌థ‌లు న‌చ్చ‌కే ఎస్కేప్!

టాలీవుడ్ లో హీరోయిన్ గా అవ‌కాశం అంత సుల‌భం కాదు. ఒక్క ఛాన్స్ కోసం ఎంతో మంది క్యూలో ఉన్నారు. కానీ అలా క్యూలో ఉన్న వాళ్ల‌కు ఛాన్సులు రావు.

By:  Srikanth Kontham   |   6 Sept 2025 9:45 AM IST
ఖాళీ లేక కాదు క‌థ‌లు న‌చ్చ‌కే ఎస్కేప్!
X

టాలీవుడ్ లో హీరోయిన్ గా అవ‌కాశం అంత సుల‌భం కాదు. ఒక్క ఛాన్స్ కోసం ఎంతో మంది క్యూలో ఉన్నారు. కానీ అలా క్యూలో ఉన్న వాళ్ల‌కు ఛాన్సులు రావు. క్యూలో లేని వారికే ఇండ‌స్ట్రీ అవ‌కాశాలిస్తుంది. వాళ్ల వెంట ప‌డి మ‌రి ఛాన్సులివ్వ‌డానికి ప‌రిశ్ర‌మ సిద్దంగా ఉంటుంది. ఇలా వెంట ప‌డినంత కాలం కొంత మంది భామ‌లు వాటిని వినియోగించుకునే స్థితిలో ఉండ‌రు. సొంతింటి స‌మోసా కంటే ప‌క్కింటి ప‌కోడినే బాగుంటుంద‌ని వెంట ప‌డుతుంటారు. తాజాగా ఓ తెలుగు హీరోయిన్ అలా టాలీవుడ్ లో వ‌చ్చిన అవ‌కాశాల‌ను కాద‌ని బాలీవుడ్ అంటూ వెళ్లింది.

ఓ రెండు సినిమా ఛాన్సులు వెంట ప‌డి మ‌రీ ఆమె గుమ్మం ముందు కెళ్లాయి. కానీ వాటిని ఆమె సున్ని తంగా తిర‌స్క‌రించింది. అందుకు కార‌ణంగా డేట్లు స‌ర్దుబాటు అనే రీజ‌న్ తెర‌పైకి తెచ్చింది. కానీ అస‌లు సంగతేంటి అన్న‌ది ఇప్పుడిప్పుడే బ‌య‌ట ప‌డుతుంది. డేట్లు స‌ర్దుబాటు కాక కాదు క‌థ‌ల న‌చ్చ‌క వాటిని తిర‌స్క‌రించింద‌న్న‌ది తాజా స‌మాచారం. ఆ రెండు సినిమాల్లో ఇప్ప‌టికే ఓ సినిమా రిలీజ్ అయింది. యావ‌రేజ్ గా ఆడింది. మ‌రో సినిమా ఆన్ సెట్స్ లో ఉంది.

అయితే ఈ రెండు సినిమాల కోసం అమ్మ‌డికి కావాల్సినంత పారితోషికం కూడా ఆఫ‌ర్ చేసారట‌. డేట్లు క్లాష్‌ అన‌గానే నిర్మాత‌లు క్యాష్ తో లాక్ చేయాల‌నుకున్నారు. కానీ స‌ద‌రు న‌టి అక్కడ కూడా లొంగ‌లేదు. దీంతో నిర్మాత‌లు వెనుదిర‌గాల్సిన ప‌రిస్థితి. అవకాశాలు వెత‌క్కుంటూ వెళ్తే ఇలాగే ఉంటుంద‌న‌డానికి ఇదో ఉదాహ‌ర‌ణ‌. ఇదే స‌మ‌యంలో ఆ హీరోయిన్ ఓ హిందీ సినిమాకు క‌మిట్ అయింది. అందుకు అమ్మ డు ఓ బ‌ల‌మైన కార‌ణం కూడా చెప్పింది. ఆ హీరో కుటుంబంతో ఉన్న కార‌ణంగానే ఆ సినిమాకు సైన్ చేసిన‌ట్లు చెప్పుకొచ్చింది.

కానీ అసలు కార‌ణం ఏంటంటే? ఆ రెండు తెలుగు సినిమాల‌ను మించిన పారితోషికం ఒక్క హిందీ సినిమాకు ఆఫ‌ర్ చేసారుట‌. ఆ కార‌ణంగానే అమ్మ‌డు హిందీ సినిమాకు ఒకే చెప్పిన‌ట్లు తెలిసింది. ఇక్క‌డే అమ్మ‌డిపై వ్య‌తిరేక‌త కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. అవ‌కాశాలు రాక ఇండ‌స్ట్రీ దాటి వెళ్ల‌డం వేరు. వ‌చ్చిన అవ‌కాశాల‌ను కాద‌ని వెళ్ల‌డం వేరంటూ కాస్త అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది ప‌రిశ్ర‌మ నుంచి. సొంత భాష‌పై ఆ మాత్రం కూడా మ‌మ‌కారం చూపించ‌క పోవ‌డం శోచ‌నీయంగా ఇండ‌స్ట్రీ భావిస్తోంది.