యువ హీరో అప్పుడే విలన్ అయ్యాడా?
తాజాగా ఈ యంగ్ హీరో అప్పుడే కోలీవుడ్ లో విలన్ గా మారిపోయాడు. `సెల్పీ` ఫేం మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో `మండాడి` అనే సినిమా తెరకెక్కుతోంది.
By: Srikanth Kontham | 20 Aug 2025 4:00 AM ISTక్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమైన సుహాస్ హీరోగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. అలాగని హీరో పాత్రలకే పరిమితం కాలేదు. హీరోగా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూనే స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కెరీర్ ప్రారంభించి హీరో అయిన నటుడు సుభాష్. దీంతో కెరీన్ ను అంతే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నాడు. ఫేం ఉన్నంత కాలమే అవకాశాలు వస్తాయన్న విషయాన్ని గ్రహించిన సుహాస్ ఆ క్రేజ్ ని తెలివిగా ఎన్ క్యాష్ చేసుకుంటున్నాడు.
తాజాగా ఈ యంగ్ హీరో అప్పుడే కోలీవుడ్ లో విలన్ గా మారిపోయాడు. `సెల్పీ` ఫేం మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో `మండాడి` అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సూరి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలోనే సుహాస్ హీరోగా నటిస్తున్నాడు. సుహాస్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయిన పోస్టర్ తో విషయం వెలుగులోకి వచ్చింది. తాను విలన్ గా నటిస్తున్నాడు? అన్న సంగతి ఇంత వరకూ ఎక్కడా రివీల్ చేయలేదు. నేరుగా పోస్టర్ తోనే అభిమానుల్ని సర్ ప్రైజ్ చేసాడు.
దీంతో సోషల్ మీడియాలో నెటి జనులు సుహాస్ కి విషెస్ తెలియజేస్తున్నారు. ఇండస్ట్రీలో తెలివైన గేమ్ ఆడుతున్నాంటూ పోస్టులు పెడుతున్నారు. సుహాస్ తరహాలోనే కార్తికేయ గుమ్మడి కొండ కూడా కోలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. `ఆర్ ఎక్స్ 100`తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయకు తమిళ చిత్రం `వలిమై`తో విలన్ అవకాశం వచ్చింది. అందులో హీరో అజిత్. అతడికి ప్రత్యర్ది పాత్రలో నటించి మెప్పించాడు. అదే తమిళ్ లో తొలి సినిమా. కానీ ఆ తర్వాత కార్తికేయకు కోలీవుడ్ లో విలన్ అవకాశాలు రాలేదు.
మరి సుహాస్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. సుహాస్ తమిళ పరిశ్రమకు తగ్గ నటుడే. అతడి ఆహార్యం తమిళ సినిమాలకు పర్పెక్ట్ గా సూటువుతుంది. సాధారణంగా తమిళంలో తెలుగు నటులకు అవకాశాలు రావడం చాలా అరుదు. అక్కడ ప్రాంతం ఆధారంగా ఛాన్సులిస్తుంటారనే విమర్శ ఉంది. గతం కంటే ఇప్పుడు మెరుగ్గానే పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు తెలుగు నటుల ఎంట్రీ కనిపిస్తుంది.
