Begin typing your search above and press return to search.

టాలీవుడ్.. 300 కోట్ల క్లబ్బులో ఫాస్టెస్ట్ తెలుగు సినిమాలు!

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు అంతకుమించి అనేలా దూసుకుపోతోంది. ఒకప్పుడు 100 కోట్లు సాధించడమే గగనంగా ఉండేది,

By:  M Prashanth   |   21 Jan 2026 9:35 AM IST
టాలీవుడ్.. 300 కోట్ల క్లబ్బులో ఫాస్టెస్ట్ తెలుగు సినిమాలు!
X

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు అంతకుమించి అనేలా దూసుకుపోతోంది. ఒకప్పుడు 100 కోట్లు సాధించడమే గగనంగా ఉండేది, కానీ ఇప్పుడు 300 కోట్ల గ్రాస్ అనేది ఒక బెంచ్ మార్క్ గా మారింది. 2022 నుండి ఇప్పటివరకు విడుదలైన సినిమాలను గమనిస్తే, మన టాలీవుడ్ హీరోలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టిస్తున్నారో అర్థమవుతుంది. కేవలం రెండు మూడు రోజుల్లోనే ఈ భారీ మార్కును అందుకుంటున్నారంటే మన సినిమాల రేంజ్ గ్లోబల్ స్థాయికి వెళ్ళిందని చెప్పవచ్చు.

ఈ రేసులో అందరినీ ఆశ్చర్యపరిచిన సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు'. ఈ సినిమా విశేషం ఏంటంటే, ఇది పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాలేదు. కేవలం తెలుగు వెర్షన్ తోనే కేవలం 8 రోజుల్లో 300 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. వింటేజ్ మెగాస్టార్ మేనియా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో పని చేసిందో ఈ నంబర్లే సాక్ష్యం.

ఇక పాన్ ఇండియా సినిమాల విషయానికి వస్తే, అల్లు అర్జున్ 'పుష్ప 2', ఎన్టీఆర్-చరణ్ ల 'RRR' కేవలం 2 రోజుల్లోనే 300 కోట్ల మార్కును దాటేసి ఇండియన్ సినిమాను షేక్ చేశాయి. పుష్ప 2 రెండో రోజే 425 కోట్లు సాధించగా, RRR 356 కోట్లు రాబట్టింది. ప్రభాస్ సినిమాలైన 'కల్కి' 3 రోజుల్లో 380 కోట్లు, 'సలార్' కూడా 3 రోజుల్లోనే ఈ క్లబ్బులో చేరి ఆయన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' 5 రోజుల్లో 308 కోట్లు వసూలు చేయగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'OG' 12 రోజుల్లో ఈ ఘనత సాధించింది. చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన తేజ సజ్జ 'హనుమాన్' 32 రోజుల్లో ఈ క్లబ్బులో చేరి కంటెంట్ ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించింది. ఇలా ప్రతి స్టార్ హీరో తనదైన శైలిలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచేశారు.

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే చాలు ఈ రోజుల్లో 300 కోట్లు అనేది పెద్ద లెక్కేం కాదు. ఓపెనింగ్స్ పరంగా ప్రభాస్, అల్లు అర్జున్ అగ్రస్థానంలో ఉండగా, లాంగ్ రన్ లో మెగాస్టార్ తన సత్తా చాటుతున్నారు. భవిష్యత్తులో రాబోయే భారీ చిత్రాలు ఈ రికార్డులను ఇంకా తక్కువ రోజుల్లోనే అధిగమించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వేగంగా 300 కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరిన తెలుగు సినిమాలు

పుష్ప 2: 2 రోజులు (425 కోట్లు)

RRR: 2 రోజులు (356 కోట్లు)

సలార్: 3 రోజులు

కల్కి: 3 రోజులు (380 కోట్లు)

దేవర: 5 రోజులు (308 కోట్లు)

మన శంకరవరప్రసాద్ గారు: 8 రోజులు (పాన్ ఇండియా కాదు)

OG: 12 రోజులు

హనుమాన్: 32 రోజులు