Begin typing your search above and press return to search.

తెలంగాణ బ్యాక్‌డ్రాప్.. ఇంకెన్ని ఛేంజెస్ కనిపిస్తాయో..

తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో వచ్చే సినిమాలంటే ఒకప్పుడు కొన్ని కథలే గుర్తొచ్చేవి. విప్లవం, నక్సలిజం, పోరాటాలు, విప్లవ గీతాలు.. ఇలాంటి అంశాల చుట్టూనే ఎక్కువ కథలు తిరిగేవి.

By:  M Prashanth   |   18 Oct 2026 9:00 AM IST
తెలంగాణ బ్యాక్‌డ్రాప్.. ఇంకెన్ని ఛేంజెస్ కనిపిస్తాయో..
X

తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో వచ్చే సినిమాలంటే ఒకప్పుడు కొన్ని కథలే గుర్తొచ్చేవి. విప్లవం, నక్సలిజం, పోరాటాలు, విప్లవ గీతాలు.. ఇలాంటి అంశాల చుట్టూనే ఎక్కువ కథలు తిరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. తెలంగాణ పల్లెలు, అక్కడి మనుషులు, వారి జీవితాలు, ఫ్యామిలీ రిలేషన్స్ కూడా సిల్వర్ స్క్రీన్ పై కొత్త కథలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బలగం సినిమా తర్వాత ఆ ఛేంజ్ మరింత క్లియర్ గా కనిపిస్తోంది.

నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ మెయినే. రెండు ప్రాంతాల ప్రజల జీవన విధానాలు, భాష, యాస, ఆచారాలు, సంప్రదాయాలు వేర్వేరుగా ఉంటాయి. ఆ తేడాలు కథలకు కొత్తదనాన్ని తీసుకొస్తాయి. అయితే గతంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నప్పుడు ఎక్కువగా విప్లవ భావాలు, ఉద్యమాలు, నక్సలైట్ పోరాటాలకే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఆ కథలకు ఒక మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, తెలంగాణ జీవితంలోని ఇతర యాంగిల్స్ బయటకు రావడం తక్కువే.

గత మూడేళ్లు, నాలుగేళ్లలో ఆ పరిస్థితిలో ఛేంజ్ కనిపిస్తోంది. ముఖ్యంగా బలగం సినిమా తెలంగాణ కథలను చూపించే విధానంలో ఒక కొత్త ఆలోచనకు దారి తీసింది. గ్రామీణ జీవితం, కుటుంబ సభ్యుల మధ్య బంధాలు, మనుషుల మధ్య ఉండే అనుబంధాలు, సంప్రదాయాలు వంటి సాధారణ విషయాలను తీసుకుని ప్రేక్షకులను కదిలించవచ్చని ఆ సినిమా ప్రూవ్ చేసింది. భారీ యాక్షన్ సీన్స్, పెద్ద హీరోలు, భారీ నిర్మాణ ఖర్చులు లేకుండానే బలమైన కథతో ప్రేక్షకులకు దగ్గరవచ్చని చూపించింది.

ఆ ఛేంజ్ తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో సినిమాలు తీసేవారికి కొత్త అవకాశాలను కల్పిస్తోంది. ఒక ప్రాంతం గురించి సినిమా తీయాలంటే అక్కడి పోరాటాలనే చూపించాల్సిన అవసరం లేదనే ఆలోచన పెరుగుతోంది. పల్లెల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలు, కుటుంబాల్లో ఉండే సమస్యలు, బంధాల మధ్య వచ్చే మనస్పర్థలు, పండుగలు, ఆచారాలు కూడా ఇంట్రెస్టింగ్ కథలకు బేస్ గా మారుతున్నాయి.

తెలంగాణ యాసను కేవలం మాటలకే పరిమితం చేయకుండా, ఆ ప్రాంతపు ఆలోచనలు, లైఫ్ స్టైల్స్ ను స్టోరీలో భాగం చేయడానికి అవకాశం వస్తోంది. అయితే తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఉందని చెప్పుకోవడం మాత్రమే సినిమాకు స్పెషాలిటీ తీసుకురాదు. ఆ నేచురాలిటీ, అక్కడి ప్రజల జీవితాలపై అవగాహన, కథలో నిజాయతీ ఉండాలి. అప్పుడే ప్రేక్షకులకు ఆ కథ తమ జీవితాలకు దగ్గరగా అనిపిస్తుంది. బలగం వంటి సినిమాలు సాధించిన గుర్తింపు కూడా ఈ విషయాన్ని గుర్తు చేస్తోంది.

ఇకపై తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలు ఎలాంటి కొత్త కథలను పరిచయం చేస్తాయన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. గ్రామీణ కథలతో పాటు పట్టణ జీవితం, మారుతున్న కుటుంబ సంబంధాలు, యువత ఆలోచనలు, కొత్త తరాల సమస్యలు కూడా స్క్రీన్ పైకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ నేపథ్యాన్ని ఒకే రకమైన కథలకు పరిమితం చేయకుండా, రకరకాల యాంగిల్స్ లో చూపించగలిగితే తెలుగు సినిమాకు మరిన్ని కొత్త కథలు దొరుకుతాయి. మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూడాలి.