మోక్షజ్ఞ కంటే ముందే వెండితెరపై వారసురాలు?
ఇప్పటి వరకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ రిజర్వ్డ్ గా ఉన్న తేజస్విని.. తన జీవితంలో జ్యూయలరీ బ్రాండ్ ఎండార్స్మెంట్ ఓ మైల్ స్టోన్ అనే చెప్పాలి.
By: M Prashanth | 7 Oct 2025 1:17 PM ISTసీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు ఎలాంటి క్రేజ్ ఉందో.. ఆయన ఇద్దరు కూతుళ్లకు కూడా అంతే రీతిలో క్రేజ్ ఉంది. పెద్ద కుమార్తె బ్రాహ్మణి వ్యాపార రంగంలో దూసుకుపోతుండగా.. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు మెరుస్తుంటారు. రెండో అమ్మాయి తేజస్విని.. కుటుంబ కార్యక్రమాల్లో, రాజకీయ కార్యక్రమాల్లో తండ్రితో పాటు తరచూ కనిపిస్తుంటారు.
విదేశాల్లో చదువుకున్న తేజస్విని.. 12 ఏళ్ల క్రితం ఇప్పుడు విశాఖ ఎంపీగా ఉన్న బిజినెస్ మ్యాన్ శ్రీభరత్ ను వివాహం చేసుకున్నారు. ఇప్పటికే ఓ మగబిడ్డకు కూడా జన్మనిచ్చారు. అయితే తేజస్విని ఎప్పుడూ మీడియా, కెమెరా ముందు కనిపించరు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో నిర్మాతగా రాణించేందుకు సిద్ధమవుతున్నా.. ఇంత వరకు కెమెరా ముందు సందడి చేయలేదు.
కానీ ఇప్పుడు తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చేందుకు తేజస్విని వచ్చారని తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ను ప్రమోట్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ లో యాడ్ ను షూట్ కూడా చేశారని వినికిడి. తద్వారా తనదైన ముద్ర వేసేందుకు బాలయ్య డాటర్ రెడీ అవుతున్నారు.
ఇప్పటి వరకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ రిజర్వ్డ్ గా ఉన్న తేజస్విని.. తన జీవితంలో జ్యూయలరీ బ్రాండ్ ఎండార్స్మెంట్ ఓ మైల్ స్టోన్ అనే చెప్పాలి. అయితే జ్యూయలరీ బ్రాండ్ కు సంబంధించిన యాడ్.. మరికొద్ది రోజుల్లో రానుందని టాక్ వినిపిస్తోంది. తేజస్విని మొట్టమొదటి ఆన్- కెమెరా వెంచర్ కచ్చితంగా ఆకట్టుకుంటుందని అంతా ఫిక్స్ అయ్యారు.
అయితే ఇప్పటి వరకు తన తండ్రి ప్రాజెక్టులను నిర్వహించడం, నిర్మాణాన్ని పర్యవేక్షించడం ద్వారా తెర వెనుక ఉన్నారు. ఇప్పుడు యాడ్ తో తెరపై సందడి చేయనున్నారు. అయితే బాలయ్య హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ షోకి నిర్మాతగా, క్రియేటివ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు. ఇప్పుడిప్పుడే సినిమా నిర్మాతగా కూడా మారుతున్నారు.
బాలయ్య తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను తేజస్విని లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇంకా ఆ సినిమా షూటింగ్ మొదలవ్వలేదు. ప్రస్తుతం బాలకృష్ణ అప్ కమింగ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టు అఖండ-2కు ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. మరిన్ని సినిమాలను నిర్మించాలని చూస్తున్నారు. ఇప్పుడు యాడ్ తో అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై కనిపించనున్నారు. చూస్తుంటే మోక్షజ్ఞ కంటే మునుపే ఆమె ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
