అక్కడ సె**ను బటానీలు అమ్మినట్టు అమ్ముతున్నారు
అక్కడ తనకు కొత్త విషయాలు పరిచయమయ్యాయని కూడా వెల్లడించారు. బ్యాంకాక్ లో ఉన్నప్పుడు అక్కడ కొత్త లైఫ్ చూసాను.
By: Sivaji Kontham | 28 Oct 2025 8:25 PM ISTబోల్డ్ గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేయడం కొందరికే సాధ్యం. అలాంటి కేటగిరీకే చెందుతుంది తేజస్వి మాదివాడ. ఆర్జీవీ `ఐస్ క్రీమ్` చిత్రంతో సోలో నాయికగా మారిన తేజస్వి, మెజారిటీ కెరీర్ సహాయనటిగా కొనసాగింది. కెరీర్ లో నటిగా పరిణతి చెందిన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళం సహా పలు దక్షిణాది చిత్రాల్లో నటించిన తేజస్వి ప్రపంచంలోని అందాన్ని వీక్షించేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపింది. ఈ బ్యూటీ కొన్నేళ్ల క్రితం పూరి జగన్నాథ్ `హార్ట్ ఎటాక్` చిత్రంలోను నటించాక, ఈ కొత్త మార్పు గురించి వెల్లడించింది.
పూరి తెరకెక్కించిన `హార్ట్ ఎటాక్` చిత్రీకరణ కోసం తాను బ్యాంకాక్, స్పెయిన్ వంటి విదేశీ లొకేషన్లకు వెళ్లానని చెప్పారు తేజస్వి మాదివాడ. అక్కడ తనకు కొత్త విషయాలు పరిచయమయ్యాయని కూడా వెల్లడించారు. బ్యాంకాక్ లో ఉన్నప్పుడు అక్కడ కొత్త లైఫ్ చూసాను. హైదరాబాద్ లాంటి చోట్ల సె* గురించి ఓపెన్ గా మాట్లాడేందుకు సిగ్గుపడతారు.. మొహమాటపడతారు. కానీ బ్యాంకాక్ లో దానిని పబ్లిగ్గా బటానీలు అమ్మినట్టు అమ్మేస్తున్నారని అన్నారు. అక్కడ లైఫ్ స్టైల్ చూశాక ఆ తర్వాత తాను చాలా మారానని, ఈ ప్రపంచంలో చాలా ఉంది.. దానిని చూసేందుకు, అందమైన లొకేషన్లను ఆస్వాధించేందుకు మన కళ్లు తెరుచుకోవాలని కూడా తేజస్వి మరోసారి బోల్డ్ గా వ్యాఖ్యానించింది. నిఖిల్ తో పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో తేజస్వి మాదివాడ ఇలాంటి చాలా అనుభవాల గురించి వెల్లడించింది.
తనకంటూ ఒక సొంత ఇల్లు కొనుక్కునే ఆలోచన లేదా? అని హోస్ట్ ప్రశ్నించగా, ఒకచోట ఇల్లు కట్టుకుని గదిలోనే ఉండిపోలేనని తేజస్వి వ్యాఖ్యానించారు. తాను ఎలా నివశించాలనుకుంటే అలా నివశిస్తానని, ఇతరులు తనను ఫాలో చేయాల్సిన పని లేదని కూడా అన్నారు. అబ్బాయిలకు సారీ చెబుతూ తన ఫన్నీ టాక్స్ ని కొనసాగించారు. తేజస్వి మాదివాడ ఇటీవల వెబ్ సిరీస్ లతో పాటు పలు టీవీ షోలలోను నటిస్తున్నారు.
