Begin typing your search above and press return to search.

పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన జోడీ!

సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై ఇతరులు ఆసక్తి చూపడం సహజమే అయినా వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడం సరికాదని అభిప్రాయపడింది.

By:  Srikanth Kontham   |   14 April 2026 10:53 AM IST
పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన జోడీ!
X

బాలీవుడ్ బుల్లితెరపై అత్యంత క్రేజీ కాంబోలో తేజస్వి ప్రకాష్ -కరణ్ కుంద్రా జోడీ ఒకటి. `బిగ్ బాస్` సీజన్ 15 నుండి మొదలైన ప్రేమాయణం పై ఇప్పటికీ సోషల్ మీడియాలో నిరంతరం హాట్ టాపిక్‌. అయితే గత కొన్ని రోజులుగా ఈ జంట త్వరలోనే వివాహం చేసుకుంటుంద‌ని నెట్టింట పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ వదంతులపై తేజస్వి ప్రకాష్ స్పందించింది. తన పెళ్లిపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించింది. ప్రస్తుతానికి తాము వివాహం చేసుకోవడం లేదందని ప్ర‌క‌టించింది. తన పెళ్లి గురించి వ‌స్తోన్న‌ వార్తలన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేసింది.

సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై ఇతరులు ఆసక్తి చూపడం సహజమే అయినా వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడం సరికాదని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఇద్ద‌రి మధ్య ఉన్న బంధం చాలా బలంగా ఉందని కానీ పెళ్లికి ఇంకా సమయం ఉందని పేర్కొంది. దీన్ని బ‌ట్టి తేజస్వి - కరణ్ ప్రస్తుతం ప్రోఫెష‌న‌ల్ కెరీర్‌లపై పూర్తి స్థాయిలో దృష్టి సారించ‌ర‌ని అర్ద‌మ‌వుతుంది. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల అప్పుడే వైవాహిక జీవితంలోకి అడుగు పెడితే? అది కెరీర్ పై ప్ర‌భావ చూపిస్తుంద‌ని తేజ‌స్వీ భావిస్తుంద‌న్న‌ది క్లియ‌ర్.

దీంతో క‌ర‌ణ్ కుంద్రా కూడా అమ్మ‌డికి అన్ని ర‌కాలుగా మ‌ద్దుతుగా నిలుస్తున్నాడు. ఇలా ఉండ‌టం క‌ర‌ణ్ కెరీర్ కూడా ప్ల‌స్ అవుతుంద‌ని భావిస్తున్నాడు. `ఇద్దరం పరస్పరం ఒకరి ఎదుగుదలను గౌరవించుకుంటామని సంతోషం వ్యక్తం చేశారు. తమ పెళ్లి అనేది ఒక పెద్ద వేడుక అని అది జరిగినప్పుడు ఖచ్చితంగా అభిమానులందరికీ తామే స్వయంగా వెల్లడిస్తామన్నారు. ఈ జంటకు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. `తేజ్రాన్` పేరుతో పిలుచుకునే అభిమానులు వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారా? అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

అయితే తేజస్వి ఇచ్చిన తాజా వివరణతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. కానీ ఆమె కెరీర్ పట్ల చూపిస్తోన్న‌ అంకితభావాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. సెలబ్రిటీలు తమ వ్యక్తిగత - వృత్తి పరమైన జీవితాల మధ్య సమతుల్యత పాటించడం ఎంత ముఖ్యమో ఈ సందర్భంగా ఆమె చాటి చెప్పారు. తేజస్వి ప్రకాష్ క్లారిటీ ఇవ్వడంతో కొన్ని వారాలుగా న‌లుగుతోన్న పెళ్లి రూమర్లకు బ్రేక్ పడింది. ప్రస్తుతానికి ఈ జంట తమ ప్రేమను ఆస్వాదిస్తూనే? కెరీర్ దూసుకుపోవాలని నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో ఈ పవర్ కపుల్ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారో చూడాలి.