Begin typing your search above and press return to search.

తేజా సజ్జా తగ్గేది లేదంతే..!

ఐతే తేజా సజ్జ నెక్స్ట్ రెండు క్రేజీ సీక్వెల్స్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఆ రెండు సినిమాలను ఒకే ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తుంది.

By:  Ramesh Boddu   |   17 Nov 2025 10:18 AM IST
తేజా సజ్జా తగ్గేది లేదంతే..!
X

యువ హీరో తేజా సజ్జా స్టోరీ సెలక్షన్స్ అతను చేస్తున్న సినిమాలు అందుకుంటున్న విజయాలు కెరీర్ ని స్ట్రాంగ్ చేస్తున్నాయి. ముఖ్యంగా తన ప్రతి సినిమాలో డివోషనల్ టచ్ ఇస్తూ తేజా సజ్జా చేస్తున్న సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ ని మెప్పిస్తున్నాయి. హనుమాన్ తో అదరగొట్టిన తేజ ఈమధ్యనే మిరాయ్ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఐతే తేజా సజ్జ నెక్స్ట్ రెండు క్రేజీ సీక్వెల్స్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఆ రెండు సినిమాలను ఒకే ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తుంది.

మిరాయ్ 2 జైత్రాయ కూడా..

మిరాయ్ సినిమా నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తోనే తేజా సజ్జ నెక్స్ట్ రెండు సీక్వెల్స్ చేస్తున్నాడు. అందులో మొదటిది జాంబి రెడ్డి సీక్వెల్ గా ప్లాన్ చేసిన జాంబి రెడ్డి 2 ఉంది. దానితో పాటు మిరాయ్ 2 జైత్రాయ కూడా ఉంది. ఈ రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు. అంటే 2026 జనవరిలో జాంబి రెడ్డి 2 సెట్స్ మీదకు వెళ్లేలా ప్లాన్ చేసిన చిత్రయూనిట్ మార్చిలో మిరాయ్ 2 ని కూడా షూటింగ్ మొదలు పెట్టే ప్లానింగ్ ఉందట.

ఇప్పటికే ఈ రెండు సినిమాల ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తైనట్టు తెలుస్తుంది. హనుమాన్, మిరాయ్ సక్సెస్ లతో కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు తేజా సజ్జ. ఐతే అతను చేస్తున్న సినిమాలు ఎంపిక చేసుకుంటున్న కథలు కూడా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తున్నాయి. అందుకే ఆ సినిమాల ఫలితాలు అలా ఉంటున్నాయి. తేజా సజ్జ కచ్చితంగా నెక్స్ట్ రాబోతున్న సినిమాలతో కూడా మరిన్ని కొత్త కథలతో వస్తాడని ఫిక్స్ అయ్యారు.

తెలుగులో మొదటి జాంబి సినిమా జాంబి రెడ్డి..

ఐతే తెలుగులో మొదటి జాంబి సినిమా అయిన జాంబి రెడ్డి సక్సెస్ అవ్వగా ఈసారి జాంబి రెడ్డి 2 ని పాన్ ఇండియా సినిమాగా చేయబోతున్నారని తెలుస్తుంది. మిరాయ్ 2 ని కూడా మరింత భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట. ఈ రెండు సినిమాలతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో తేజా సజ్జ ఫ్యాన్సీ డీల్ ఏర్పాటు చేసుకున్నాడని తెలుస్తుంది. యువ హీరోల్లో తేజా సజ్జ తనకంటూ ఒక సెపరేట్ మార్క్ సెట్ చేసుకున్నాడు.

రాబోతున్న సినిమాలతో కూడా తేజ ఇలానే తన ఫాం కొనసాగించాలని సినీ ప్రియులు కోరుతున్నారు. మిరాయ్ 2, జాంబి రెడ్డి 2 రెండు సినిమాలు 2027 లో రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉంటుందని తెలుస్తుంది. మిరాయ్ 2ని కార్తీక్ ఘట్టమనేనినే డైరెక్ట్ చేస్తుండగా జాంబి రెడ్డి సీక్వెల్ కథ మాత్రం ప్రశాంత్ వర్మ ఇవ్వగా నూతన దర్శకుడు ఈ సీక్వెల్ డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. జాంబి రెడ్డి 2 ఈసారి ఆడియన్స్ కు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా బీభత్సమైన ప్లానింగ్ తో వస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్.