జాతిరత్నాలు మొదటి హీరో ఎవరో తెలుసా?
ఏది ఎవరికి రాసి పెట్టి ఉంటే వాళ్లకే చెందుతుందని ఊరికే అనలేదు. సినీ ఇండస్ట్రీలో కూడా అంతే. ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేయడం లాంటివి చాలానే జరుగుతుంటాయి.
By: Sravani Lakshmi Srungarapu | 9 Sept 2025 4:06 PM ISTఏది ఎవరికి రాసి పెట్టి ఉంటే వాళ్లకే చెందుతుందని ఊరికే అనలేదు. సినీ ఇండస్ట్రీలో కూడా అంతే. ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేయడం లాంటివి చాలానే జరుగుతుంటాయి. అయితే ఇలా జరిగినందుకు కొందరు బాధపడితే మరికొందరు మాత్రం సంతోషిస్తారు. ఒకవేళ సినిమా హిట్ అయితే అనవసరంగా సినిమాను వదులుకున్నాననే అని కొందరనుకుంటే, మరికొందరు మాత్రం ఈ సినిమా మనకు రాసిపెట్టి లేదులే అని సర్ది చెప్పుకుంటారు.
హను మాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు
అలా ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేయడం ఇప్పటివరకు చాలానే జరిగాయి. కానీ ఇప్పుడు మరో సినిమా అలా బయటపడింది. ఇండస్ట్రీలోని యంగ్ హీరో ఒకరు ఓ బ్లాక్ బస్టర్ మూవీని వదులుకున్నారు. ఆయన ఎవరో కాదు, బాల నటుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసి హను మాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ.
సెప్టెంబర్ 12న మిరాయ్
హను మాన్ తర్వాత తేజ సజ్జ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు తేజ. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన మిరాయ్ సినిమాలో మంచు మనోజ్, శ్రియా శరణ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది.
మిరాయ్ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తేజ సజ్జ ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉంటూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు. అందులో భాగంగానే తాను ఓ సూపర్ హిట్ సినిమాను వదులుకున్నట్టు తెలిపారు తేజ. ఆ సినిమా మరేదో కాదు, జాతిరత్నాలు. అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ముందు తేజ వద్దకే వెళ్లిందట.
నవీన్ ఆ సినిమాకు 100% న్యాయం చేశాడు
జాతిరత్నాలు సినిమాను డైరెక్టర్ ముందు నవీన్ పోలిశెట్టితో కాకుండా తేజ సజ్జాతో తీయాలనుకున్నారట. అందుకే తేజకు అనుదీప్ జాతిరత్నాలు కథను కూడా చెప్పారట. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని, చివరకు ఆ ఛాన్స్ నవీన్ కు వెళ్లి, ఆ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్నారని తేజ చెప్పారు. అయితే జాతిరత్నాలు సినిమా నవీన్ కు వెళ్లడం తనకు చాలా హ్యాపీగా అనిపించిందని, అతను ఆ మూవీకి 100% న్యాయం చేశారని తెలిపారు తేజ.
