తేజ ప్లాన్ కు ఎవరైనా అసూయ పడాల్సిందే!
వరుస సక్సెస్‌లను అందుకోవడంతో పెరిగిన మార్కెట్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలనే నేపథ్యంలో తేజ తన తదుపరి సినిమాల విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 20 Sept 2025 1:00 AM ISTఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ను స్టార్ట్ చేసిన తేజ సజ్జ ఆ తర్వాత హీరోగా మారిన సంగతి తెలిసిందే. హీరోగా ఎక్కువ సినిమాలు చేసిన అనుభవం లేకపోయినా సినిమాల ఎంపిక విషయంలో తేజ తీసుకుంటున్న జాగ్రత్తలు అతన్ని సక్సెస్ వైపు నడిపిస్తున్నాయి. తాజాగా మిరాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న తేజ ఆ సినిమాతో అద్భుతమైన ఓపెనింగ్స్ ను అందుకున్నారు.
హను మాన్, మిరాయ్ తో వరుస సక్సెస్‌లు
ఆల్రెడీ హను మాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయి సక్సెస్ అందుకున్న తేజ సజ్జా ఇప్పుడా ఆ క్రేజ్ ను మరింత పెంచుకుని మిరాయ్ తో హను మాన్ రికార్డుల్ని తిరగరాయాలని చూస్తున్నారు. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మిరాయ్ అదిరిపోయే కలెక్షన్లను అందుకుంటుంది. హను మాన్, మిరాయ్ సినిమాలతో వరుస సక్సెస్ అందుకున్న తేజ క్రేజ్ ఇప్పుడు భారీగా పెరిగిపోయింది.
తేజ నెక్ట్స్ మూవీగా జాంబిరెడ్డి2
వరుస సక్సెస్‌లను అందుకోవడంతో పెరిగిన మార్కెట్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలనే నేపథ్యంలో తేజ తన తదుపరి సినిమాల విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే తన తర్వాతి సినిమాగా సూపర్ హిట్ మూవీ జాంబిరెడ్డికి సీక్వెల్ గా జాంబిరెడ్డి2 ను చేయబోతున్నారు తేజ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే ఈ సినిమాను కూడా నిర్మించనుంది.
అయితే ఇప్పుడు తేజ చేతిలో మూడు సీక్వెల్ సినిమాలున్నాయి. సీక్వెల్స్ సినిమాలంటే మామూలుగానే క్రేజ్ ఎక్కువ ఉంటుంది. దానికి తోడు మూడు సినిమాలూ వేటికవే ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సినిమాలు కావడం ఆడియన్స్ కు వాటిపై మరింత ఆసక్తి కలిగేలా చేస్తున్నాయి. ఇదిలా ఉంటే రీసెంట్ గా మిరాయ్ సక్సెస్ అయిన సందర్భంగా మీడియా ముందుకొచ్చి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటున్న తేజ తన తర్వాతి సినిమాల గురించి చెప్పి ఆ ఆసక్తిని ఇంకాస్త పెంచారు.
సీక్వెల్స్ అప్డేట్స్ ఇచ్చిన తేజ
ముందుగా జాంబిరెడ్డి2 చేస్తున్న తేజ ఆ సినిమా ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టే ఉంటుందని, కామెడీతో పాటూ యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని, ఈ సినిమాలోని విజువల్స్ ఆడియన్స్ ను మరో ప్రపంచానికి తీసుకెళ్తాయని, జనవరి నుంచి జాంబిరెడ్డి2 షూటింగ్ మొదలై, 2027 లో రిలీజ్ కానుందని చెప్పారు. జై హను మాన్ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుందని, ప్రశాంత్ వర్మ, రిషబ్ శెట్టి ఫ్రీ అయ్యాక ఈ సినిమా మొదలవుతుందని తేజ తెలిపారు. ఇక మిరాయ్ సీక్వెల్ గురించి చెప్తూ మిరాయ్2 లో ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచే ఐడియాలు చాలానే ఉన్నాయని, రానా విలన్ గా నటిస్తారని వార్తలొస్తుండగా రానాకు ఇంకా స్క్రిప్ట్ చెప్పలేదు కానీ ఫస్ట్ పార్ట్ ను మించి సెకండ్ పార్ట్ ఉంటుందని, మిరాయ్2 ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని తేజ చెప్పారు. తేజ చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే తన లైనప్ గురించి తెలుసుకున్న ఎవరికైనా అసూయ కలగక మానదు.
