Begin typing your search above and press return to search.

తేజ సజ్జా 'మిరాయ్'.. హనుమాన్ కన్నా ఎక్కువే..

ఇప్పుడు మిరాయ్ తో మరో హిట్ ను తన అకౌంట్ లో వేసుకున్నారు తేజ. సినిమాలో తన నటనతో ప్రశంసలు అందుకుంటున్నారు.

By:  M Prashanth   |   13 Sept 2025 4:00 PM IST
తేజ సజ్జా మిరాయ్.. హనుమాన్ కన్నా ఎక్కువే..
X

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన తేజ.. ఆ తర్వాత పెద్దవాడు అయ్యాక బేబీతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. జాంబీ రెడ్డితో హీరోగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని సత్తా చాటారు.

చివరిగా పాన్ ఇండియా మూవీ హనుమాన్ తో వేరే లెవెల్ లో అలరించారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఆ సినిమాతో గత ఏడాది అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. నేషనల్ వైడ్ గా క్రేజ్ దక్కించుకున్నారు. దీంతో తేజ్ సజ్జా అప్ కమింగ్ మూవీలపై అందరి ఫోకస్ పడింది.

అయితే ఇప్పుడు మిరాయ్ తో థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఆ ఫాంటసీ ఫిల్మ్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు మిరాయ్ తో మరో హిట్ ను తన అకౌంట్ లో వేసుకున్నారు తేజ. సినిమాలో తన నటనతో ప్రశంసలు అందుకుంటున్నారు.

దీంతో హనుమాన్, మిరాయ్ చిత్రాలతో వరుసగా రెండు భారీ హిట్స్ ను దక్కించుకున్న తేజ.. ఫుల్ హ్యాపీ మోడ్ లో ఉన్నారు. అయితే ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో మిరాయ్ టికెట్స్ హాట్ కేక్స్ లా సేల్ అవుతున్నాయి. అదే సమయంలో ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చి నెట్టింట వైరల్ గా మారింది.

బుక్ మై షోలో ఇప్పుడు మిరాయ్ మూవీకి గాను తొలి రోజుకి సంబంధించి 3,75,000 టికెట్స్ సేల్ అయ్యాయి. అదే హనుమాన్ చిత్రానికి గాను అప్పుడు ఫస్డ్ డేకి సంబంధించి 3,39,00 టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో హనుమాన్ మూవీ కన్నా ఇప్పుడు మిరాయ్ మొదటి రోజు టికెట్లు ఎక్కువ సేల్ అవ్వడం గమనార్హం.

కాగా, మిరాయ్ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాగా.. వాటిని అందుకోవడంలో కూడా విజయం సాధించింది. ఇప్పుడు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.27.20 కోట్లు వసూలు చేసినట్లు మూవీ టీమ్ తెలిపింది. ఓవర్సీస్‌ లో కూడా మిరాయ్‌ కు మంచి స్పందన లభిస్తోందని చెప్పింది. మొదటి రోజు అక్కడ రూ.7 లక్షల డాలర్లు వసూలు చేసినట్లు వెల్లడించింది.