Begin typing your search above and press return to search.

'అంత కష్టపడితే AI షాట్స్ అంటారా?'.. వీడియోతో తేజ సజ్జా క్లారిటీ

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా.. మిరాయ్ మూవీతో మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   8 Sept 2025 1:00 AM IST
అంత కష్టపడితే AI షాట్స్ అంటారా?.. వీడియోతో తేజ సజ్జా క్లారిటీ
X

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా.. మిరాయ్ మూవీతో మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనున్న విషయం తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 12వ తేదీన వరల్డ్ వైడ్ గా సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు.

రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్.. వేరే లెవెల్ లో రెస్పాన్స్ అందుకుంది. మూవీపై భారీ బజ్ క్రియేట్ చేసింది. అయితే ట్రైలర్ చూశాక.. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో సినిమా తీసినట్లు క్లియర్ గా తెలుస్తోంది. వీఎఫ్ ఎక్స్ విషయంలో అస్సలు రాజీ పడలేదని క్లారిటీ వచ్చింది. కానీ కొందరు మాత్రం ఏఐ షాట్స్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

దీంతో ఇప్పుడు ఆ విషయంపై ఓ మీడియాతో చిట్ చాట్ లో తేజ సజ్జా స్పందించారు. గత మూవీ హనుమాన్ కోసం కూడా ప్రస్తావించారు. హనుమాన్ చేసినప్పుడు ఏఐ లేదని, లేకుంటే ఏఐతో చేశారనే వారని తెలిపారు. నచ్చే వీఎఫ్ ఎక్స్ ఇస్తుంటే.. దానికి కొంతమంది ఏఐతోనే చేస్తున్నారంటే.. ఎవరు దానికి బాధ్యులు అంటూ సహనం వ్యక్తం చేశారు.

"నిజంగా రూ.50 కోట్లు పెట్టి రూ.60 కోట్లు పెట్టి సినిమా చేస్తుంటే.. అంత ఇడియాటిక్ గా ఎవరు పని చేయరు కదా.. నాకెక్కడ బాధ వేస్తుందంటే.. సంవత్సరమంతా కష్టపడి చదువుకుని.. ఎగ్జామ్ హాల్ కు వెళ్లి కింద మీద పడి తినీ తినక ఎగ్జామ్ రాస్తావ్.. రిజల్ట్ వచ్చాక ఇంటికి వెళ్లి చెబితే.. పక్కోడి పేపర్ చూసి కాపీ కొట్టావ్ కదా అంటే ఎంత బాధపడతాం? ఇది ఒక ఎగ్జామ్ ఇష్యూ.. ఒక ఇంట్లో ఇష్యూ.. కానీ సినిమా అలా కాదు కదా" అని అన్నారు.

"ఇంత కష్టపడి చేస్తే మీకు నచ్చుద్ది.. బాగా చేశారనే అంటారని సినిమా తీశాం.. బాగుంది అను.. బాలేదని అను.. కానీ ఇలా చేశారా అంటూ తప్పుగా కామెంట్ చేస్తే చాలా బాధగా ఉంటుంది" అని చెప్పారు. ట్రైలర్ లోని మంకీ షాట్ గురించి మీడియా ప్రతినిధి అడిగారు. వీఎఫ్ ఎక్స్ బ్రేక్ డౌన్ చూపిస్తా అంటూ విజువల్స్ ను చూపించారు.

"ఏదేమైనా నాకేం ప్రాబ్లమ్ లేదు.. 18-20 గంటలపాటు సీజే వర్క్ చేస్తుంటారు. నిద్ర కూడా పోరు. డైరెక్టర్ రోజుకు 200-350 షాట్స్ ఓకే చేయాలి. చివరి 15 రోజులు నిద్ర కూడా ఉండదు.. చాలా కష్టపడాలి. మంచి లేదా చెడు అనాలి.. కానీ వీఎఫ్ ఎక్సే కాదనడం కరెక్ట్ కాదు.. విశ్వ ప్రసాద్ గారికి సొంత సీజే కంపెనీ కూడా ఉంది" అని తెలిపారు.