Begin typing your search above and press return to search.

మిరాయ్ టీమ్ కి యూఎస్‌లో గ్రాండ్ వెల్కమ్.. మొదలైన బ్లాక్‌బస్టర్ టూర్

ఈ టూర్‌లో భాగంగా హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ యూఎస్‌కి చేరుకున్నారు.

By:  M Prashanth   |   20 Sept 2025 11:48 AM IST
మిరాయ్ టీమ్ కి యూఎస్‌లో గ్రాండ్ వెల్కమ్.. మొదలైన బ్లాక్‌బస్టర్ టూర్
X

యంగ్ హీరో తేజ సజ్జా వరుస విజయాలతో పాన్ ఇండియా రేంజ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హనుమాన్ తర్వాత మిరాయ్ సినిమాతో మరోసారి తన పవర్ ని చూపించాడు. థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు ఓవర్సీస్‌లోనూ సంచలనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌లో మిరాయ్ కలెక్షన్లతో రికార్డులు బద్దలవుతుండగా, ఈ విజయాన్ని అభిమానులతో పంచుకోవడానికి మిరాయ్ టీమ్ స్పెషల్ గా యూఎస్ టూర్ ప్లాన్ చేసింది.

ఈ టూర్‌లో భాగంగా హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ యూఎస్‌కి చేరుకున్నారు. మొదటి స్టాప్‌గా సియాటిల్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే తెలుగు కమ్యూనిటీ వార్మ్ వెల్కమ్ చెప్పింది. పూల గుచ్ఛాలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ రాకతో యూఎస్‌లోని తెలుగు అభిమానుల్లో వేరే లెవెల్ క్రేజ్ మొదలైంది. సోషల్ మీడియాలో కూడా మిరాయ్ టీమ్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.


మిరాయ్ టూర్‌లో మూడు నగరాల్లో గ్రాండ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. శుక్రవారం సియాటిల్‌లో, శనివారం డల్లాస్‌లో, ఆదివారం న్యూజెర్సీలో అభిమానులతో కలిసేలా ప్లాన్ చేశారు. ప్రతి నగరంలో స్పెషల్ ఈవెంట్స్, మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నారు. సినిమా చూసి మంచి సక్సెస్ అందించిన ఓవర్సీస్ ఆడియన్స్‌కి వ్యక్తిగతంగా థ్యాంక్స్ చెప్పడం కోసం తేజ సజ్జా సిద్ధమయ్యాడు.

ఇప్పటికే మిరాయ్ యూఎస్ బాక్సాఫీస్‌లో $2 మిలియన్ దాటేసి, 2.5 మిలియన్ వైపు దూసుకెళ్తోంది. టాప్ స్టార్స్ మాత్రమే సాధించిన ఈ ఫీట్‌ని తేజ సజ్జా చాలా తక్కువ సమయంలో సాధించడం విశేషం. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యువత, పిల్లల వరకు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉన్న కంటెంట్ ఈ విజయానికి కారణమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. మైథాలజీతో యాక్షన్, అడ్వెంచర్‌ని మిక్స్ చేసిన మిరాయ్ యూఎస్‌లో పెద్ద ఎత్తున కలెక్షన్లు రాబడుతోంది.

అమెరికాలోని తెలుగు కమ్యూనిటీ మాత్రమే కాకుండా స్థానిక ఇండియన్ ఫిలిం లవర్స్ కూడా ఈ ఈవెంట్స్‌కి భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఇలాంటి టూర్లు టాప్ స్టార్ హీరోలే చేస్తారు. కానీ తేజ సజ్జా ఇంత చిన్న సమయంలో పాన్ ఇండియా సక్సెస్‌లు సాధించి ఈ స్థాయిలోకి రావడం యూత్‌కి ఇన్‌స్పిరేషన్‌గా మారింది. మొత్తానికి, మిరాయ్ బాక్సాఫీస్ విజయాన్ని యూఎస్ టూర్ ద్వారా మరింత గ్రాండ్‌గా మార్చేందుకు తేజ సజ్జా టీమ్ సిద్ధమైంది.