Begin typing your search above and press return to search.

మిరాయ్.. యూఎస్ బాక్సాఫీస్ మైండ్ బ్లాక్ లెక్కలు..!

ఈ క్రమంలో లేటెస్ట్ గా శుక్రవారం రిలీజైన మిరాయ్ సినిమాకు యూఎస్ బాక్సాఫీస్ క్రేజీగా మారింది.

By:  Ramesh Boddu   |   13 Sept 2025 11:50 AM IST
మిరాయ్.. యూఎస్ బాక్సాఫీస్ మైండ్ బ్లాక్ లెక్కలు..!
X

ఓవర్సీస్ లో మన సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అంచనాలకు తగిన సినిమాను అందిస్తే మాత్రం యూఎస్ లో ఉన్న తెలుగు ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా శుక్రవారం రిలీజైన మిరాయ్ సినిమాకు యూఎస్ బాక్సాఫీస్ క్రేజీగా మారింది. ఆల్రెడీ ప్రీమియర్స్ తోనే సినిమాకు 394000 డాలర్స్ రాబట్టిన మిరాయ్ సినిమా ఫస్ట్ డే మరో 400000 డాలర్స్ కలెక్ట్ చేసింది. ప్రీమియర్స్ తో కలిపి యూఎస్ లో మిరయ్ డే 1 8 లక్షల డాలర్స్ ని వసూలు చేసింది. సినిమాకు మంచి టాక్ ఉంది కాబట్టి బుకింగ్స్ బాగున్నాయి. సాటర్డే, సండే రెండు రోజుల్లో మంచి బుకింగ్స్ జరిగేలా ఉంది.

మిరాయ్ సినిమా 1 మిలియన్..

అలా చూస్తే వీకెండ్ లోగా తేజ సజ్జ మిరాయ్ సినిమా 1 మిలియన్ దాటేసేలా ఉంది. స్టార్ సినిమాలకు మాత్రమే యూఎస్ మార్కెట్ లో మిలియన్స్ కలెక్షన్స్ వస్తుంటాయి. హనుమాన్ సినిమా కూడా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. మిరాయ్ కూడా అక్కడ కలెక్షన్స్ అదరగొట్టేస్తుంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన మిరాయ్ సినిమా లో తేజ సజ్జ, మంచి మనోజ్, శ్రీయ ప్రధాన పాత్రలుగా చేశారు.

ఈ సినిమాకు ప్రభాస్ ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. మిరాయ్ సినిమా విజువల్స్ తెలుగు సినిమా స్టాండర్డ్స్ మరోసారి హాలీవుడ్ కి ఏమాత్రం తక్కువ కాదనేలా ప్రూవ్ చేసింది. మిరాయ్ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది. కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారన్న విషయం మళ్లీ ప్రూవ్ అయ్యింది.

బెస్ట్ క్వాలిటీ అవుట్ పుట్..

మిరాయ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఐతేజ్ ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ కు బెస్ట్ క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చారు. సినిమా రిలీజ్ ముందే టేబుల్ ప్రాఫిట్ తో మూవీ వచ్చింది. మిరాయ్ సినిమా గ్రాఫిక్స్ కూడా ఇంప్రెస్ చేశాయి. తెలుగు సినిమాను మరోసారి టాప్ లెవెల్ లో నిలబెట్టే మూవీగా మిరాయ్ సపోర్ట్ చేస్తుంది.

యూఎస్ లోనే కాదు తెలుగు రెండు రాష్ట్రాల్లో మిరాయ్ కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. అఫీషియల్ గా మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ తేజ సజ్జ మిరాయ్ తో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేశాడని చెప్పొచ్చు. మిరాయ్ ఫస్ట్ డే ఇండియా కలెక్షన్స్ 12 కోట్ల దాకా రాబట్టిందని తెలుస్తుంది.