Begin typing your search above and press return to search.

శ్రియాపై తేజ సజ్జ అలాంటి కామెంట్స్.. శ్రియ రియాక్షన్ ఏంటంటే?

తేజ సజ్జా.. బాల నటుడిగా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రశాంత్ వర్మ 'జాంబిరెడ్డి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

By:  Madhu Reddy   |   29 Aug 2025 2:50 PM IST
శ్రియాపై తేజ సజ్జ అలాంటి కామెంట్స్.. శ్రియ రియాక్షన్ ఏంటంటే?
X

తేజ సజ్జా.. బాల నటుడిగా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రశాంత్ వర్మ 'జాంబిరెడ్డి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అంతకుముందు సమంత చేసిన బేబీ సినిమాలో కూడా కనిపించినప్పటికీ.. పూర్తిస్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం జాంబిరెడ్డి సినిమాతోనే. ఈ సినిమా హిట్ తర్వాత ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ, అద్భుతం వంటి సినిమాలు చేశారు. 2023లో మళ్ళీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో చేసిన పాన్ ఇండియా మూవీ హనుమాన్. ఈ సినిమా భారీ హిట్ కొట్టడంతో తేజ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. అలా హీరోగా మంచి క్రెడిట్ కొట్టేసిన ఈయన.. మే 12వ తేదీన 'మిరాయ్' అనే సినిమాతో మరోసారి మన ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో తేజ సజ్జా శ్రియా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

శ్రియా పై తేజ ఊహించని కామెంట్స్..

శ్రియా గురించి మాట్లాడుతుంటే.. ఆమె రియాక్షన్ చూసిన చాలా మంది జనాలు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ శ్రియా గురించి తేజ సజ్జా ఏం మాట్లాడారంటే.." శ్రియా మామ్ చాలా బిజీ షెడ్యూల్ కలిగి ఉన్నారు. పైగా ప్రస్తుతం ఆమె బాలీవుడ్.. కానీ టైం తీసుకుని మా సినిమా కోసం ఆమె నటించడం నిజంగా గ్రేట్.అయితే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కథ,వాళ్ల పాత్రలు బాగా నచ్చి చేశారు. అలాగే చిన్న తనంలో శ్రియా మేడమ్ తో నేను బాలు, ఠాగూర్ వంటి సినిమాల్లో చేశాను. ఛత్రపతి సినిమాలో కూడా చేసినప్పటికీ శ్రియా గారితో నాకు సీన్స్ ఏమీ లేవు. మేడంకున్న బిజీ షెడ్యూల్ కి మా సినిమాలో నటించడం అంటే నిజంగా థాంక్స్ చెప్పుకోవాల్సిందే. కానీ కథ బాగా నచ్చడం వల్లే ఈ పవర్ ఫుల్ పాత్రలో చేద్దాం అని శ్రియా గారు ఇందులో నటించారు. మాతో పాటు నేపాల్, ముంబై హిమాలయాల్లో కూడా తిరిగారు.ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి నటించారు కాబట్టే సినిమా అంత రియలెస్టిక్ గా కనిపిస్తోంది".. అంటూ తేజ సజ్జా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.ఇక తేజ సజ్జా శ్రియా గురించి మాట్లాడుతున్నంతసేపు ఆమె ఫన్నీ రియాక్షన్లు ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

మిరాయ్ సినిమా విశేషాలు..

మిరాయ్ సినిమా విషయానికి వస్తే.. తేజ సజ్జా హీరోగా.. రితిక నాయక్ హీరోయిన్ గా.. మంచు మనోజ్ విలన్ గా.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శ్రియా, జగపతిబాబు, జయ్ రామ్ లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 12న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేయగా ఈ ట్రైలర్ ప్రేక్షకులలో అంచనాలు పెంచేసింది.