తేజ 'మిరాయ్' ట్రైలర్.. కంప్లీట్ సర్ప్రైజ్ మ్యాజిక్!
హనుమాన్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా.. ఇప్పుడు మిరాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
By: M Prashanth | 28 Aug 2025 12:44 PM ISTహనుమాన్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా.. ఇప్పుడు మిరాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ జోనర్ లో యమా గ్రాండ్ గా రూపొందుతున్న ఆ సినిమాకు యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో తేజ సజ్జా సూపర్ యోధుడిగా కనిపించనుండగా.. ఆయన సరసన రితికా నాయక్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. మరో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, శ్రియ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. వాటిని పెంచే ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
దూసుకుపోతున్న రైలు సీన్ తో ట్రైలర్ స్టార్ అవ్వగా.. ఈ ప్రమాదం ప్రతీ గ్రంథాన్ని చేరబోతుందంటూ బ్యాక్ గ్రౌండ్ లో డైలాగ్ వస్తుంది. ఆ తర్వాత మనోజ్, రితికను పరిచయం చేశారు మేకర్స్. ఈ దునియాలో ఏదీ నీది కాదు భయ్యా అన్నీ అప్పే అంటూ తేజ ట్రెండీ లుక్ లో దర్శనమిచ్చారు. ఈ రోజు నీ దగ్గర.. రేపు నా దగ్గర అని చెబుతారు.
నీకు తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డావ్.. ఇప్పుడు నిన్న నమ్మే వాళ్ల కోసం నిలబడు అంటూ రితిక చెప్పగా.. కత్తులు దూస్తూ మనోజ్ మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. నా ప్రస్తుతం ఊహాతీతం అంటూ పవర్ ఫుల్ రోల్ లో సింహాసనంపై కనిపించారు. తొమ్మిది గ్రంధాలు వాడికే దొరికితే పవిత్ర గ్రంధంలో పారేది రక్తమని జగపతి బాబు చెబుతారు. శ్రీరాముడు పుట్టిన స్థలం.. త్రేతా యుగంలో పుట్టిన ఆయుధమని ఒక కర్రలాంటి ఆయుధాన్ని చూపించారు. ఆ తర్వాత మంచుకొండల్లో తేజ సజ్జా కనిపించారు. అహం, రణసిద్ధం, జైత్రయ అంటూ పోరాడే సన్నివేశాలు అదిరిపోయాయి. ఇదే చరిత్ర, భవిష్యత్తు, ఇదే మిరాయ్.. మనోజ్ ను తేజ ఢీకొడతారు. చివర్లో శ్రియ నీకో సాయం అవసరమని చెబుతోంది.
అప్పుడే కొండపై శ్రీరాముడు కనిపిస్తారు. ఆ సీన్ మాత్రం గూస్ బంప్స్ అనే చెప్పాలి. ఆ విజువల్ తో ట్రైలర్ ఎండ్ అయింది. అప్పుడు వచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. ఓవరాల్ గా సినిమా కాన్సెప్ట్ మొత్తం ట్రైలర్ లో క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారు మేకర్స్. తొమ్మిది గ్రంధాలు కాపాడడమే ప్రధాన అంశంగా తెలుస్తోంది. అయితే ట్రైలర్ లో మొత్తం మ్యాజిక్ కనిపించిందనే చెప్పాలి. 2 నిమిషాల 59 సెకన్ల ఈ ట్రైలర్‌లో చాలా మూమెంట్స్ 'ఊహాతీతం'గా అనిపిస్తాయి. డ్రాగన్ ఎంట్రీ... శ్రీరాముడి దర్శనం.. సహా పలు సీన్స్ అయితే వేరే లెవెల్. ట్రైలర్ లోని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. గౌర హరి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే పెర్ఫెక్ట్ సెట్ అయింది.
నిర్మాతల రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. తేజ సజ్జా మరోసారి తన యాక్టింగ్ తో మెప్పించారు. సూపర్ యోధుడిగాగా ఆకట్టుకున్నారు. మంచు మనోజ్ విలనిజం పండించారు. ఓవరాల్ గా ట్రైలర్ లో కనిపించిన ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాపై ఉన్న అంచనాలను పెంచేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మిరాయ్.. పాన్ ఇండియా స్థాయిలో దాదాపు 8 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్లలో విడుదల కానుంది.
నిజానికి సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కావాల్సిన సినిమాను సెప్టెంబర్ 12వ తేదీకి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు రీసెంట్ గా మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్సెస్ అన్నీ మూవీపై ఆడియన్స్, ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొల్పాయి. ఇప్పుడు ట్రైలర్.. వాటిని ఆకాశాన్ని తాకేలా చేసింది. తేజ సజ్జాకు మరో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అనేలా హైప్ ను క్రియేట్ చేసింది. మరి మిరాయ్ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
