ఇండస్ట్రీలో కొత్త సంప్రదాయానికి మిరాయ్ బాటలు..
తేజ సజ్జా మిరాయ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
By: M Prashanth | 30 Aug 2025 10:23 PM ISTతేజ సజ్జా మిరాయ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ట్రైలర్ లో విజువల్స్, హై క్వాలిటీ గ్రాఫిక్స్ హైప్ పెంచేశాయి. మళ్లీ సినిమాపై హనుమాన్ వైబ్స్ వస్తున్నాయి. మరోసారి తేజ సజ్జా గ్రాండియర్ సినిమాతో రానున్నట్లు ప్రేక్షకులకు అర్థం అయ్యింది. సెప్టెంబర్ 12 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాను ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఇందులో మంచు మనోజ్ నెగెటివ్ రోల్ లో కనిపించనున్నారు. 1600కు పైగా సీజీ షాట్స్ తో సినిమాను గ్రాండ్ గా తీర్చి దిద్దారు. ఇది థియేటర్లలో ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందని నమ్ముతున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరో వారంలో సెన్సార్ పనులు కూడా పూర్తి కానున్నాయి.
ఇప్పటికే సినిమాపై అంచనాలు పెరిగిపోవడంతో తమిళం, హిందీ, మలయాళం, కన్నడలో పెద్ద పెద్ద సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. తెలుగు థియేట్రికల్ రైట్స్ ను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సుమారు రూ. 25 కోట్లకు డీల్స్ కంప్లీట్ చేశారని టాక్ వినిపిస్తుంది. మిరాయ్ కు ఉన్న హైప్ చూస్తుంటే ఇది రీజనబుల్ రేటే.
ఇక తొలి షో లో పాజిటివ్ టాక్ వస్తే.. ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ కొట్టే ఛాన్స్ ఉంది. దీంతో సినిమా లాభాల్లోకి వెళ్లిపోతుంది. కంటెంట్ లో చూపించిన గ్రాండ్ విజువల్స్ తోనే ఇది సాధ్యం అవుతుందని నమ్మకం వస్తుంది. అయితే దర్శకుడు కార్తీక్ కు మంచి ట్రాక్ రికార్డ్ లేనప్పటికీ.. మిరాయ్ ని అతను తెరకెక్కించిన తీరు నమ్మకం కలిగిస్తుంది.
అయితే ఇప్పుడే అత్యాశకు వెళ్లకుండా సినిమాను ఈ రేట్లకు ఇవ్వడం నిజమే అయితే.. ఇండస్ట్రీలో రోల్ మోడల్ అవుతుంది. అంతేకాదు, టికెట్ల పెంపునకు కూడా రిక్వెస్ట్ చేయడం లేదని మేకర్స్ ఇప్పటికే చెప్పారు. దీంతో ఎగ్జిబిటర్లు హమ్మయ్యా అనుకుంటున్నారు. ప్రతీ సినిమాకు రిలీజ్ రోజు టికెట్ రేట్ రూ.50. రూ. 100 పెంచితే.. యావరేజ్, ఫ్లాప్ సినిమాలపై దారుణంగా దెబ్బ పతుతోంది. హను- మాన్ కూడా మినిమమ్ రేట్లతో రూ.300 కోట్ల మార్క్ అందుకుంది.
