మిరాయ్.. రెండు సర్ ప్రైజ్ ల ట్విస్ట్ ఏంటో..?
తేజా సజ్జ హనుమాన్ తర్వాత పర్ఫెక్ట్ సినిమాతో వస్తున్నాడు అదే మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు.
By: Ramesh Boddu | 9 Sept 2025 10:54 AM ISTతేజా సజ్జ హనుమాన్ తర్వాత పర్ఫెక్ట్ సినిమాతో వస్తున్నాడు అదే మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. సినిమాలో తేజ సజ్జాని ఢీ కొడుతూ మంచు మనోజ్ కూడా నటించాడు. మనోజ్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్లీ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈమధ్యనే భైరవం సినిమాతో రాగా నెక్స్ట్ మిరాయ్ తో సర్ ప్రైజ్ చేయనున్నాడు.
తక్కువ ధరకే మిరాయ్ సినిమా..
సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతున్న మిరాయ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో తేజ సజ్జ స్పీచ్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఒక మంచి సినిమా తీశామన్న కాన్ ఫిడెన్స్ అతనిలో కనిపిస్తుంది. అంతేకాదు ఈమధ్య టికెట్ రేట్లు ఎక్కువ ఉండటం వల్లే సినిమా థియేటర్లకు ఆడియన్స్ రావట్లేదన్న టాక్ ఉంది. అందుకే ఈ సినిమాకు ఎలాంటి టికెట్ హైక్స్ లేకుండా చాలా తక్కువ ధరకే సినిమా చూసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయాన్ని తేజా సజ్జ వెల్లడించాడు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లను ఒప్పించి ఈ సినిమా మేమంతా ఫ్యామిలీ మొత్తం చూసేలా చేస్తున్నామని అన్నారు.
ఇక చివర్లో ఈ సినిమాలో ఎమోషన్, యాక్షన్, అడ్వెంచర్, డివోషనల్ అన్నీ ఉన్నాయంటూ అంతేకాదు సినిమాలో రెండు సర్ ప్రైజ్ లు కూడా ఉన్నాయని చెప్పాడు తేజా సజ్జ. యువ హీరో ఆ మాట చెప్పినప్పటి నుంచి సినిమాలో ఉన్న ఆ రెండు సర్ ప్రైజ్ లు ఏంటి.. ఒకవేళ సినిమాలో స్పెషల్ క్యామియోస్ ఏమైనా ఉన్నాయా అన్న వేట మొదలు పెట్టారు. సినిమా ట్రైలర్ లో రెండుచోట్ల ఫేస్ కనిపించకుండా కొన్ని షాట్స్ పడ్డాయి. వాటిల్లో ఒకవేళ మన స్టార్స్ ఎవరైనా నటించారా అన్న ఆలోచన ఉంది.
రెండు సర్ ప్రైజ్ లు సంథింగ్ స్పెషల్..
తేజ సజ్జ ఊరించిన విధానం చూస్తే నిజంగానే ఆ రెండు సర్ ప్రైజ్ లు సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ఉంటాయి. ఐతే మిరాయ్ లో క్యామియో చేసే ఛాన్స్ ఎవరికి ఉందా అన్న డిస్కషన్ మొదలైంది. మిరాయ్ సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక మంచి డిస్కషన్ పాయింట్ ఉన్న సినిమాగా మారింది. ఇప్పటివరకు అయితే సినిమాకు సంబందించిన అన్ని అంశాలు కూడా కలిసి వచ్చాయి. మరి థియేటర్ లో ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటన్నది మరో 3 రోజుల్లో తెలుస్తుంది.
తేజా సజ్జ కాన్ఫిడెన్స్ చూస్తే మాత్రం మరో సూపర్ హిట్ పక్కా అనేలా ఉంది. కార్తీక్ ఘట్టమనేని ఈగల్ మిస్ ఫైర్ అయినా ఈసారి మిరాయ్ తో టార్గెట్ ని రీచ్ అవ్వాలని చూస్తున్నాడు. సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి బజ్ బాగానే ఉంది ఇక సినిమా ఆడియన్స్ మనసులు గెలిస్తే చాలు పాస్ అయినట్టే లెక్క.
