Begin typing your search above and press return to search.

ఆ రెండు సినిమాలు డ్రాప్.. మిరాయ్ కు లైన్ క్లియర్

తాజాగా యంగ్ హీరో తేజ సజ్జా సినిమాకు ఇదే జాక్ పాట్ తగిలేలాగా ఉంది. ఆయన లీడ్ రోల్ లో తెరకెక్కిన మిరాయ్ సెప్టెంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది.

By:  M Prashanth   |   1 Sept 2025 8:04 PM IST
ఆ రెండు సినిమాలు డ్రాప్.. మిరాయ్ కు లైన్ క్లియర్
X

ఏ సినిమా మేకర్స్ అయినా సోలో రిలీజ్ కోసమే చూస్తారు. కానీ, అన్ని సినిమాలకు ఇలాంటి సోలో రిలీజ్ దొరకదు. పలుమార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ నెలకొంటుంది. ఒకవేళ ఓ సినిమాకు ఫుల్ హైప్ ఉండి.. సింగిల్ రిలీజ్ డేట్ దొరికితే? భారీ అంచనాలతో ఉన్న సినిమా సోలోగా బాక్సాఫీస్ ముందుగు వస్తే? ఇంకేముంటుంది. ఆ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఖాయం.

తాజాగా యంగ్ హీరో తేజ సజ్జా సినిమాకు ఇదే జాక్ పాట్ తగిలేలాగా ఉంది. ఆయన లీడ్ రోల్ లో తెరకెక్కిన మిరాయ్ సెప్టెంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. విజువల్ వండర్స్ గా ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచింది. అయితే ఈ సినిమాకు సెప్టెంబర్ 12న బాక్సాఫీస్ వద్ద పోటీ నెలకొంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన కిష్కింధాపురి, దుల్కర్ సల్మాన్ నటించిన కాంత కూడా సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

అయితే, ఈ రెండు సినిమాలు ప్రస్తుతం వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. సాయి శ్రీనివాస్ లేటెస్ట్ సినిమా కిష్కింధాపురి అనుకున్న తేదీకి విడుదల కావడం లేదని సమాచారం. ఈ సినిమా ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలోకి రానుంది. ఇక దుల్కర్ కాంత సినిమా.. పాటలు రిలీజ్ అయ్యాయి. కానీ ఈ పాటలు తప్పా సినిమా ప్రమోషన్లు ప్రారంభం కాలేదు. మేకర్స్ ప్రమోషన్స్ కూడా ఏమీ ప్లాన్ చేయలేదు.

దీంతో ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి మేకర్స్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. అంటే దాదాపు ఈ సినిమా కూడా అనుకున్నట్లు సెప్టెంబర్ 12న విడుదల కాదని అర్థముతోంది. ఈ లెక్కన తేజ సజ్జా మిరాయ్ సెప్టెంబర్ 12న సోలోగా రిలీజ్ కావడం దాదాపు ఖాయమైనట్లు. దీంతో రెండో వారంలో బాక్సాఫీస్ వద్ద సింగిల్ సినిమాగా రిలీజ్ కానుంది.

ఇక మరోవైపు, కిష్కింధాపురి సెప్టెంబర్ 13న రానుంది. అంటే ఈ సినిమా కూడా సోలో రిలీజ్ అవుతుంది. అయితే మిరాయ్ పాన్ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇధి కచ్చితంగా ఈ సినిమాకు భారీ స్థాయిలో వసూళ్లు సాధించే అవకాశం ఉంటుంది. కాగా, మిరాయ్ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఫుల్ హైప్ ఉంది.