Begin typing your search above and press return to search.

రిలీజియస్ మూవీస్ ఎందుకు.. బాలీవుడ్ మీడియాకు తేజ పవర్ఫుల్ కౌంటర్

మిరాయ్ మూవీతో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   5 Sept 2025 11:48 AM IST
రిలీజియస్ మూవీస్ ఎందుకు.. బాలీవుడ్ మీడియాకు తేజ పవర్ఫుల్ కౌంటర్
X

మిరాయ్ మూవీతో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సూపర్ హీరో మూవీగా రూపొందుతున్న ఆ సినిమాతో సెప్టెంబర్ 12వ తేదీన థియేటర్స్ లో సందడి చేయనున్నారు. యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీలో తేజ సజ్జా.. సూపర్ యోధగా కనిపించనున్నారు.

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానున్న ఆ మూవీ ప్రమోషన్స్ తో ఇప్పుడు తేజ సజ్జా అండ్ కో బిజీగా ఉన్నారు. ఇప్పుడు నార్త్ లో ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ రిపోర్టర్ పదే పదే రిలీజియస్ మూవీస్ ఎందుకు అని అడగ్గా.. దానికి తేజ సజ్జా ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.

ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడం లేదని తేజ సజ్జా ఆన్నారు. పదే పదే లవ్ స్టోరీలు చేస్తే ఎవరూ ఎందుకు అడగరని, తనను మాత్రం అడుగుతూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. మన ధర్మం గురించి చూపించే ప్రయత్నం చేస్తున్నామని, అందుకు గర్వించాలని చెప్పారు. ఇది మన భూమి, ఇవి మన మోరల్స్ అంటూ క్లాస్ తీసుకున్నారు.

ఇప్పటి వరకు 3 నిమిషాల 10 సెకన్ల ట్రైలర్ మాత్రమే చూశారని, అందులో కొన్ని సెకన్ల పాటు రాముడిని చూసి ఇది రిలీజియస్ మూవీ అంటూ అడుగుతున్నారని అన్నారు. మిరాయ్ లో ఫాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ ఉన్నాయని తెలిపారు. తన లాస్ట్ మూవీ హనుమాన్ కూడా అంతేనని, అందులో ఓ వేరే ఎమోషన్ ఉంటుందని పేర్కొన్నారు.

మన ఇతిహాసాల్లోని నీతిని తాము ఏదో ఒక విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నామని తేజ సజ్జా తెలిపారు. ప్రస్తుత జనరేషన్ కు మన చరిత్రను కూల్ గా చెప్పే ప్రయత్నం ఇదని అన్నారు. అందుకే దానిని చూసి ప్రతి ఒక్కరూ సంతోషించాలని అన్నారు. దీంతో ఒక్కసారిగా అంతా చప్పట్లు కొట్టగా, ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఇక సినిమా విషయానికొస్తే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. శ్రియ శరణ్, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. గౌర హరి మ్యూజిక్ అందిస్తున్నారు. మరి మరో వారం రోజుల్లో రిలీజ్ కానున్న మిరాయ్ మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.