Begin typing your search above and press return to search.

మిరాయ్ ట్రైలర్ రెడీ.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

భారీ స్కేల్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను తెలుగు మాత్రమే కాకుండా పలు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

By:  M Prashanth   |   26 Aug 2025 2:38 PM IST
మిరాయ్ ట్రైలర్ రెడీ.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!
X

సూపర్ హీరో సినిమాలంటే యూత్‌కు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇటీవల హనుమాన్ సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటిన తేజ సజ్జా ఇప్పుడు మరో విజువల్ వండర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతని కొత్త సినిమా మిరాయ్ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా, టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


భారీ స్కేల్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను తెలుగు మాత్రమే కాకుండా పలు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా మేకర్స్‌ ఒక కొత్త పోస్టర్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఆ పోస్టర్‌లో మంజు మనోజ్ “బ్లాక్ స్వోర్డ్”గా, తేజ సజ్జా “మిరాయ్” శక్తిని ధరించి, ఒకరిపై ఒకరు తలపడుతున్న స్టైల్‌లో కనిపించారు. ఈ కాన్సెప్ట్ మరింత కురియాసిటీని రేపుతోంది.

ఒకే స్క్రీన్‌పై ఇద్దరు పవర్ఫుల్ యాక్టర్స్, పురాతన శక్తులను ప్రతిబింబించే రెండు విభిన్న ఆయుధాలతో ఫైట్ చేయడం చూడటానికి మాస్ ఆడియన్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌కూ థ్రిల్లింగ్‌గా అనిపించబోతుందని ఇండస్ట్రీ టాక్. అంతే కాదు, ఆగస్ట్ 28న మిరాయ్ అధికారిక ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు యూనిట్ ప్రకటించింది.

ఈ ట్రైలర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత ఎత్తుకు చేరుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 12న మిరై గ్రాండ్‌గా 2D, 3D ఫార్మాట్లలో వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రాబట్టడమే కాకుండా, తెలుగు సినిమాకి మరోసారి కొత్త మార్కెట్ తెరవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి అందించిన బాణీలు ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ సాంగ్ నుంచే మంచి బజ్ రావడంతో మ్యూజిక్ ఆల్బమ్ పై కూడా అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ భారీ స్థాయిలో జరుగుతోంది. నిర్మాతలు చెబుతున్నట్టుగా “మిరాయ్” పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ రేంజ్‌లో కూడా గుర్తింపు తెచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నారు. మరి ఈ యాక్షన్ ఫాంటసీ ఎపిక్ ఎంత మేరకు ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.