మిరాయ్ గూస్ బంప్స్ గ్యారెంటీ..!
తేజా సజ్జ మిరాయ్ సినిమా మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది.
By: Ramesh Boddu | 9 Sept 2025 9:55 AM ISTతేజా సజ్జ మిరాయ్ సినిమా మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది. ట్రైలర్ తోనే మిరాయ్ పై అంచనాలు ఏర్పడ్డాయి. అదీగాక హనుమాన్ తర్వాత తేజా సజ్జా నుంచి వస్తున్న సినిమా అవ్వడంతో హైప్ మరింత పెరిగింది. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కారణంగా మిరాయ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో తేజ సజ్జ, మంచు మనోజ్, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తో పాటు మిగతా చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
మిరాయ్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్..
ఈవెంట్ లో నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసం తీశాం. ఆడియన్స్ అంతా కూడా తప్పకుండా థియేటర్ లో చూడాలని అన్నారు. ఇక మంచు మనోజ్ కూడా తేజాని తనని నమ్మి ఈ ప్రాజెక్ట్ చేసినందుకు థాంక్స్ చెప్పారు.
కెరీర్ లో గ్యాప్ తీసుకున్నా.. తన కంబ్యాక్ కోసం అడిగిన వారికి మిరాయ్ తో వస్తున్నా అన్నారు. కార్తీక్ ని తన కోసం దేవుడే పంపించాడని అన్నారు. తిరిగి సినిమాల్లో నటించడం సంతోషంగా ఉందని ఇక తేజా సజ్జ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ఎంచుకుంటూ మంచి డెడికేషన్ తో పనిచేస్తున్నాడని అన్నారు మంచు మనోజ్.
మంచు మనోజ్ తనకు పెద్దన్న..
తేజా సజ్జ మాట్లాడుతూ.. అసలు తన కెరీర్ గురించి ఎప్పుడు ఆలోచించలేదని.. మిరాయ్ లాంటి సినిమా తనని నమ్మి ఇచ్చినందుకు విశ్వ ప్రసాద్ గారికి థాంక్స్ అన్నాడు తేజా సజ్జ. అంతేకాదు తనలో ఈ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేస్తున్న ఆడియన్స్ కి థాంక్స్ చెప్పాడు. ఇక మంచు మనోజ్ తనకు పెద్దన్న లాగా అని.. ఆయనతో నటించడం ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ అని అన్నాడు. ఆయన కూడా ఇది ఫస్ట్ సినిమాలా చేశారని చెప్పాడు తేజ సజ్జ. సినిమాకు గౌరా హరి మ్యూజిక్ అదిరిపోతుందని చాలా చోట్ల గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయని అన్నాడు తేజ సజ్జ.
ఇదే స్పీచ్ లో రాబోతున్న తెలుగు భారీ సినిమాల ప్రస్తావన కూడా తెచ్చాడు తేజ సజ్జ. రాబోతున్న పెద్ది, ఎస్.ఎస్.ఆర్.ఎం.బి, అల్లు అర్జున్ అట్లీ సినిమా ఇవన్నీ కూడా తెలుగు సినిమా స్థాయి మరింత పెంచుతాయని అన్నాడు తేజ సజ్జ. ఇక ఫైనల్ గా మిరాయ్ తో తాము చేసిన ఈ సిన్సియర్ ఎఫర్ట్ ని థియేటర్ లో సెప్టెంబర్ 12న చూడండని అన్నాడు తేజ సజ్జ.
