Begin typing your search above and press return to search.

తేజ స‌జ్జా ది గ్రేట్.. ప్రపంచ‌వ్యాప్తంగా వీక్ష‌ణ‌లో రికార్డ్!

ఇలాంటి స‌మ‌యంలో బ్యాక్ టు బ్యాక్ విజ‌యాల‌తో దూసుకెలుతున్నాడు. హ‌నుమాన్ త‌ర్వాత‌ `మిరాయ్` చిత్రంతో అత‌డు పాన్ ఇండియాలో ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటున్నాడు.

By:  Sivaji Kontham   |   22 Oct 2025 10:01 AM IST
తేజ స‌జ్జా ది గ్రేట్.. ప్రపంచ‌వ్యాప్తంగా వీక్ష‌ణ‌లో రికార్డ్!
X

డిజిట‌ల్ విప్ల‌వం పెను మార్పులు తెస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఓటీటీ విప్ల‌వం ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న ఇలాంటి స‌మ‌యంలో చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేకుండా కంటెంట్ ఉన్న ఏ సినిమాకి అయినా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విభిన్న భాష‌లు సంస్కృతుల‌ ప్రేక్ష‌కుల నుంచి ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ఇటీవ‌లే విడుద‌లైన తేజ స‌జ్జా మిరాయ్ ని ఓటీటీలో ఏకంగా 20 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ పూర్త‌వ్వడం ఒక రికార్డ్. తేజ స‌జ్జా ఇంకా రైజింగ్ హీరో మాత్ర‌మే. అత‌డు ఒక్కో సినిమాతో ప‌రిణ‌తి చెందుతూ హీరోగా త‌న‌ను తాను ఆవిష్క‌రించుకుంటున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో బ్యాక్ టు బ్యాక్ విజ‌యాల‌తో దూసుకెలుతున్నాడు. హ‌నుమాన్ త‌ర్వాత‌ `మిరాయ్` చిత్రంతో అత‌డు పాన్ ఇండియాలో ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటున్నాడు.

అత‌డు టాలీవుడ్ అగ్ర హీరోల‌కు ధీటుగా ఇప్పుడు ప్ర‌పంచానికి సుప‌రిచిత‌డు. మిరాయ్ చిత్రాన్ని ఇండియాతో పాటు మ‌లేషియా, బ్యాంకాక్, ఇండోనేషియా, థాయ్ లాండ్ లాంటి చోట్ల ఎక్కువ మంది వీక్షించార‌ని స‌మాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో కంటెంట్ పిల్ల‌లు, ఫ్యామిలీ ప్రేక్ష‌కుల్ని గొప్ప‌గా ఆక‌ర్షించ‌డ‌మే ఈ విజ‌యానికి కార‌ణం. థియేట‌ర్ల‌లో గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కించుకుని దాదాపు 200 కోట్లు వ‌సూలు చేసిన మిరాయ్, ఇప్పుడు ఓటీటీలోను సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.

తాజాగా జియో హాట్ స్టార్ అందించిన వివ‌రాల ప్ర‌కారం... మిరాయ్ ఓటీటీలో దాదాపు 200 మిలియ‌న్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది... అంటే ఈ సంఖ్య దాదాపు 20కోట్లు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా ప‌లు భాషలలో అందుబాటులో ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా భాష‌తో సంబంధం లేకుండా ఈ సినిమాని వీక్షించారు. థియేట్రికల్ వెర్షన్ 2 గంటల 49 నిమిషాల రన్‌టైమ్ తో రిలీజ్ కాగా, OTT విడుదలను 2 గంటల 46 నిమిషాలకు ట్రిమ్ చేసారు.

మిరాయ్ 10 అక్టోబ‌ర్ నుంచి జియో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వ‌చ్చింది. డిజిటల్ వెర్షన్‌లో `వైబ్ ఉండి..` పాట లేదు. 3 నిమిషాల నిడివిని ట్రిమ్ చేసి న త‌ర్వాత సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసారు. `మిరాయ్` హిందీ వెర్షన్ నవంబర్ 2025లో విడుదల అవుతుంది.