మిరాయ్ ఫస్ట్ డే కలెక్షన్స్ షాక్..!
సినిమా ట్రైలర్ రిలీజ్ నుంచి అంచనాలు బాగా ఏర్పడగా సినిమా కూడా అదే రేంజ్ లో ఉండటం వల్ల తేజ సజ్జ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా మిరాయ్ నిలిచింది.
By: Ramesh Boddu | 13 Sept 2025 10:22 AM ISTతేజ సజ్జ మంచు మనోజ్ నటించిన తేజ సజ్జ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశాడు. మిరాయ్ సినిమాలో స్టోరీ, స్క్రీన్ ప్లే తో పాటు విజువల్స్ ఆడియన్స్ చేత సూపర్ అనిపించుకుంటున్నాయి. ఈ బడ్జెట్ లో కార్తీక్ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడని పొగిడేస్తున్నారు.
తేజ సజ్జ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ ఓపెనింగ్..
సినిమా ట్రైలర్ రిలీజ్ నుంచి అంచనాలు బాగా ఏర్పడగా సినిమా కూడా అదే రేంజ్ లో ఉండటం వల్ల తేజ సజ్జ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా మిరాయ్ నిలిచింది. మిరాయ్ సినిమా ఫస్ట్ డే ఇండియాలో అన్ని భాషల్లో కలుపుకుని 12 కోట్లు కలెక్ట్ చేసింది. దాదాపు సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వచ్చింది. మార్నింగ్ షోస్ కి 56.20 % ఆక్యుపెన్సీ ఉండగా ఆఫ్టర్ నూన్ కి 63.61 % ఆక్యుపెన్సీ అయ్యింది. ఇక సినిమాకు హిట్ టాక్ రావడంతో ఈవెనింగ్ కల్లా 70 % ఆక్యుపెన్సీ తో దూసుకెళ్లింది.
మిరాయ్ సినిమాను హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ తో కరణ్ జోహార్ రిలీజ్ చేశారు. అయితే హిందీ లో ఈ సినిమా టాక్ ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు. ఐతే లాస్ట్ ఇయర్ హనుమాన్ తో అదరగొట్టిన తేజ సజ్జ. మిరాయ్ తో మరో సెన్సేషనల్ సినిమాతో వచ్చాడు. హనుమాన్ సినిమా ఫస్ట్ డే 9.3 కోట్లు తీసుకు రాగా.. పెయిడ్ ప్రీమియర్స్ తో 4.7 కోట్లు కలెక్ట్ చేసింది.
12 కోట్ల పైన కలెక్షన్స్ తోనే బాక్సాఫీస్..
అంటే హనుమాన్ కూడా దాదాపు 12 కోట్ల పైన కలెక్షన్స్ తోనే బాక్సాఫీస్ లెక్కలు మొదలు పెట్టింది. హనుమాన్ సినిమా పాన్ ఇండియా హిట్ కలెక్షన్స్ తో దూసుకెళ్లింది. ఆ సినిమ 300 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. ఐతే మిరాయ్ కూడా హనుమాన్ రేంజ్ లోనే ఫస్ట్ డే 12 కోట్ల దాకా రాబట్టింది. మొత్తానికి తేజ సజ్జ తనకంటూ ఒక సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకుంటున్నాడు.
కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన మిరాయ్ సినిమాలో తేజ సజ్జ తన రోల్ లో మరోసారి ఇంప్రెస్ చేశాడు. సినిమాలో మంచు మనోజ్ విలనిజం అదిరిపోయింది. మనోజ్ కి ఈ సినిమా పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇస్తుందని చెప్పొచ్చు. శ్రీయ కూడా అంబిక పాత్రలో ఇంప్రెస్ చేసింది. ఫైనల్ గా మిరాయ్ సినిమా ఓపెనింగ్ డే 12 కోట్ల కలెక్షన్స్ తో మొదలు పెట్టింది. ఇది ఎక్కడిదాకా వెళ్తుంది ఎన్ని రికార్డులు సృష్టిస్తుంది అన్నది చూడాలి.
