Begin typing your search above and press return to search.

తేజ సజ్జ 'మిరాయ్'.. ఇది చాలా రీజనబుల్ డీల్!

తేజ సరసన రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్ గా కనిపించనున్నారు. జగపతిబాబు, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

By:  M Prashanth   |   30 Aug 2025 1:15 PM IST
తేజ సజ్జ మిరాయ్.. ఇది చాలా రీజనబుల్ డీల్!
X

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ మిరాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. యాక్షన్ ఫాంటసీ జోనర్ లో రూపొందిన ఆ సినిమాతో సెప్టెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీలో సూపర్ యోధగా కనిపించి సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నారు!

తేజ సరసన రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్ గా కనిపించనున్నారు. జగపతిబాబు, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీవీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్ తో చాలా క్వాలిటీతో సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్.. ఓ రేంజ్ లో మెప్పించింది. సినిమాపై అంచనాలను పెంచింది. అదే సమయంలో సినిమా రూ.40 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించగా.. థియేట్రికల్ రైట్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్ల బిజినెస్ అవుతుందనేది ఆసక్తికరం.

అయితే మిరాయ్ థియేట్రికల్ బిజినెస్ రీసెంట్ గా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. రూ.24.5 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల హక్కులను వేర్వేరు డిస్ట్రిబ్యూటర్లకు రూ. 18 కోట్లకు మేకర్స్ అమ్మినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ రైట్స్ ను రూ.4.5 కోట్లకు సేల్ చేసినట్లు వినికిడి. ఆ ప్రకారం..

అమెరికా- రూ.4.5 కోట్లు

ఆంధ్ర- రూ.8 కోట్లు

నైజాం- రూ.7 కోట్లు

సీడెడ్- రూ.3 కోట్లు

కర్ణాటక- రూ.2 కోట్లు

అయితే ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిజినెస్ లెక్కలు చూసుకుంటే, మిరాయ్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చాలా ఈజీగా సింపుల్ గా కంప్లీట్ చేస్తుందని సినీ వర్గాల్లో ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. డీల్ ను చూస్తుంటే.. చాలా రీజనబుల్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదేమో.

ఏదేమైనా ఇప్పటికే మిరాయ్ పై మంచి అంచనాలు ఉన్నాయి. పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యే ఉంది. థియేట్రికల్ రైట్స్ డీల్ చాలా రీజనబుల్ గా ఉంది. కాబట్టి కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు.. వసూళ్ల వర్షమే. కచ్చితంగా కొనుగోలుదారులకు లాభాలను కురిపించనుంది. ఆశాజనకమైన డబ్బులు అందించే చిత్రంగా మారనుంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.