Begin typing your search above and press return to search.

మిరాయ్ ఎందుకంత స్పెషల్..?

బెస్ట్ క్వాలిటీ వి.ఎఫ్.ఎక్స్ కూడా సినిమాను ఎట్రాక్ట్ చేస్తుంది. ట్రైలర్ లో సీజీ వర్క్ ఇంప్రెస్ చేసింది. ఇక తేజ, మంచు మనోజ్ లు ఇద్దరు చాలా బలమైన పాత్రల్లో కనిపిస్తున్నారు.

By:  Ramesh Boddu   |   10 Sept 2025 10:30 AM IST
మిరాయ్ ఎందుకంత స్పెషల్..?
X

తేజా సజ్జ హనుమాన్ సినిమా తర్వాత చేసిన మిరాయ్ మరో 48 గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో తేజా సజ్జతో మంచు మనోజ్ ఢీ కొడుతున్నాడు. రితిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. సినిమా మంచి కంటెంట్ తోనే వస్తుందని ప్రచార చిత్రాలు చెబుతున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కించింది. మిరాయ్ సినిమా ఎందుకంత స్పెషల్ మూవీ అయ్యింది అంటే.. ఈ సినిమాను మొత్తం 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.

సినిమా తక్కువ బడ్జెట్ లో బెస్ట్ క్వాలిటీతో..

ఐతే సినిమా ట్రైలర్ లోని విజువల్స్ చూస్తే ఇదేదో 100 నుంచి 200 కోట్లతో తీసిన సినిమాలా అనిపిస్తుంది. స్టార్స్ కి భారీ రెమ్యునరేషన్ లేదు కాబట్టి సినిమా తక్కువ బడ్జెట్ లో బెస్ట్ క్వాలిటీతో పూర్తి చేశారు. ఇక నెక్స్ట్ మిరాయ్ విజువల్ క్వాలిటీ చూస్తే కచ్చితంగా ఇది ఆడియన్స్ కు మంచి విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఉందనిపిస్తుంది. కథకు తగినట్టుగానే విజువల్స్ అదరగొట్టేసేలా ఉన్నాయి.

బెస్ట్ క్వాలిటీ వి.ఎఫ్.ఎక్స్ కూడా సినిమాను ఎట్రాక్ట్ చేస్తుంది. ట్రైలర్ లో సీజీ వర్క్ ఇంప్రెస్ చేసింది. ఇక తేజ, మంచు మనోజ్ లు ఇద్దరు చాలా బలమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. సో తప్పకుండా ఈ ఇద్దరు ది బెస్ట్ ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఇదే క్రమంలో సినిమాకు ఎలాగు బజ్ ఉంది కాబట్టి టికెట్ ప్రైజ్ అని హడావిడి చేయకుండా.. ఆడియన్స్ మీద అదనపు భారం వేయకుండా రెగ్యులర్ టికెట్ ప్రైజ్ తోనే సినిమా వస్తుంది.

మౌత్ టాక్ తో సూపర్ హిట్..

సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా మంచి వసూళ్లు తెచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈమధ్య కాలంలో మహావతార్ నరసింహ, లేటెస్ట్ రిలీజ్ లిటిల్ హార్ట్స్ ఈ రెండు సినిమాలు కూడా మౌత్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ అదరగొట్టాయి. వాటికి ఎలాంటి టికెట్ రేట్ల హైక్ జరగలేదు. అయినా కంటెంట్ నచ్చి జనాలు థియేటర్లకు వచ్చారు.

సో మిరాయ్ కూడా ఆడియన్స్ కి నచ్చితే మాత్రం అద్భుతాలు చేసే ఛాన్స్ ఉంది. మిరాయ్ సినిమాలో రెండు సర్ ప్రైజ్ లు ఉన్నాయని కూడా తేజ సజ్జ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు. వాటి కోసం కూడా ఆడియన్స్ చాలా క్యూరియస్ గా ఉన్నారు. తేజ సజ్జ సినిమాల సెలక్షన్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. యువ హీరోగా తేజ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నాడు. సినిమాల ఎంపికను బట్టే అతని కాన్ఫిడెన్స్ కూడా బాగుంది. మరి మిరాయ్ కూడా హిట్ పడితే కుర్రాడి పంట పండినట్టే లెక్క.