Begin typing your search above and press return to search.

మిరాయ్ ప్రమోషన్స్ లో అతనెక్కడ..?

హనుమాన్ తర్వాత తేజా సజ్జా చేస్తున్న సినిమా మిరాయ్. ఈ మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశారు.

By:  Ramesh Boddu   |   25 Aug 2025 9:00 PM IST
మిరాయ్ ప్రమోషన్స్ లో అతనెక్కడ..?
X

హనుమాన్ తర్వాత తేజా సజ్జా చేస్తున్న సినిమా మిరాయ్. ఈ మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశారు. రవితేజతో ఈగల్ సినిమా చేసి ఫెయిల్ అయిన కార్తీక్ ఈసారి మిరాయ్ తో రాబోతున్నాడు. ఐతే ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేసింది. సినిమా కూడా సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతుంది. ఐతే రిలీజ్ మరో 12 రోజులు మాత్రమే ఉన్నా కూడా సినిమా యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు.

మనోజ్ ఎక్కడ కనిపించట్లేదు..

బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఏదో తేజా సజ్జా ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఐతే తేజా సజ్జ మిరాయ్ లో విలన్ గా మంచు మనోజ్ నటించాడు. మనోజ్ టీజర్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా కూడా మంచు మనోజ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో కనిపించట్లేదు. ఆమధ్య అతను నటించిన భైరవం సినిమాకు ఇంటర్వ్యూస్ ఇంకా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు మంచు మనోజ్.

కానీ మిరాయ్ సినిమా ప్రమోషన్స్ లో మనోజ్ ఎక్కడ కనిపించట్లేదు. మరి దీని వెనక రీజన్స్ ఏంటన్నది తెలియదు కానీ మిరాయ్ సినిమా 10 రోజులు రిలీజ్ ఉంది కాబట్టి ప్రమోషన్స్ వేగం పెంచాల్సిందే. అసలే ఈమధ్య సినిమాలన్నీ కూడా కంటెంట్ ఎంత బాగున్నా తగిన ప్రమోషన్స్ లేకపోతే మాత్రం జనాలు థియేటర్లకు వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. ఇలాంటి టైం లో కాస్త కంటెంట్ ఉన్న సినిమాగానే అనిపిస్తున్న మిరాయ్ ఎందుకు ప్రమోషన్స్ విషయంలో వెనకపడుతున్నారన్నది అర్థం కావట్లేదు.

డిఫరెంట్ కథతో మిరాయ్..

మిరాయ్ సినిమా ఒక డిఫరెంట్ కథతో రాబోతుంది. అంతేకాదు సినిమాలో విజువల్స్ చాలా సర్ ప్రైజింగ్ గా ఉండబోతున్నాయి. సినిమా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని చిత్రయూనిట్ చెబుతున్నారు. హనుమాన్ తర్వాత తేజా సజ్జ నటించిన ఈ మిరాయ్ కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

మిరాయ్ సినిమా లో రితిక నాయక్ హీరోయిన్ గా నటించింది. అశోక వనంలో అర్జున కళ్యాణం తో మెప్పించిన ఈ అమ్మడు హాయ్ నాన్న సినిమాలో జస్ట్ చిన్న రోల్ చేసింది. మిరాయ్ తో రితికకు మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.

మంచు మనోజ్ మిరాయ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యాడు. ఐతే రిలీజ్ టైం లో మనోజ్ ప్రమోషన్స్ కూడా చేస్తే సినిమాకు ఇంకాస్త ప్లస్ అవుతుంది. కానీ మంచు మనోజ్ మిరాయ్ ప్రమోషన్స్ కి ఇప్పటివరకు అయితే రాలేదు. రిలీజ్ ముందైనా సరే మనోజ్ మిరాయ్ ప్రమోషన్స్ లో పాల్గొంటాడా లేదా అన్నది చూడాలి.