Begin typing your search above and press return to search.

మిరాయ్ రెండు రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ.55.60 కోట్లకు పైగా గ్రాస్

మంచి కంటెంట్ తో వస్తే ఆడియెన్స్ ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తారని చాలాసార్లు నిరూపితమైంది.

By:  M Prashanth   |   14 Sept 2025 1:59 PM IST
మిరాయ్ రెండు రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ.55.60 కోట్లకు పైగా గ్రాస్
X

మంచి కంటెంట్ తో వస్తే ఆడియెన్స్ ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తారని చాలాసార్లు నిరూపితమైంది. ఇక స్ట్రాంగ్ కంటెంట్ తో వచ్చిన తేజా సజ్జా మిరాయ్ తో బాక్సాఫీస్‌ దగ్గర దుమ్ము రేపుతున్నాడు. సెన్సేషనల్ కలెక్షన్స్‌తో ప్రతి చోటా మాస్ హంగామా చేస్తూ తెలుగు సినిమా వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా ఆదివారం, సోమవారం నాటికే లాభాల బాటలోకి చేరనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

థియేటర్లలో ఫ్యామిలీస్, యూత్, సీనియర్స్ ఇలా అన్ని వయసుల ప్రేక్షకులు వస్తుండటమే కాకుండా, షోలు ఫుల్ హౌస్ అవుతున్నాయి. అడ్వెంచర్, మైథాలజీ, హిస్టరీ అంశాలతో చూపించిన విజువల్స్, స్టోరీటెల్లింగ్ అద్భుతమైన రెస్పాన్స్‌ని తెచ్చాయి. మిరాయ్ రెండు రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ.55.60 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది.

మొదటి రోజు రూ.27.20 కోట్ల కలెక్షన్ సాధించిన ఈ సినిమా, రెండో రోజు మరింత పెరిగింది. ఇక ఆదివారం బుకింగ్స్‌ చూస్తుంటే, ఇది సినిమా కోసం బిగ్గెస్ట్ డే అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి జోరు కొనసాగితే వచ్చే వారం లోపలే భారీ రికార్డులు బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది.

ప్రత్యేకంగా నార్త్ అమెరికాలో సినిమా అద్భుతమైన ట్రెండ్ చూపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మిరాయ్ అక్కడ 1.30 మిలియన్ కలెక్షన్ సాధించింది. అక్కడి వరకు చూస్తే ఇప్పటికే ప్రాఫిట్స్‌లోకి వెళ్ళింది. ఇంత చిన్న వయసులో ఉన్న హీరోకి ఇలాంటి ఫీట్ రావడం అరుదు. ఇది తేజా సజ్జా మార్కెట్ పాన్ ఇండియా స్థాయిలో ఎలా పెరుగుతుందో కూడా సూచిస్తోంది.

డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని విజన్ మీద నమ్మకం ఉంచిన తేజ, ఎలాంటి రాజీ పడని ప్రొడక్షన్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ రిస్క్ తీసుకోవడం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఫలితమిచ్చింది. భారీ బడ్జెట్ కాకపోయినా, కంటెంట్‌పై నమ్మకం పెట్టుకుని తీసిన ఈ సినిమా లాంగ్ రన్‌లో మరింత లాభాలను రాబట్టనుంది. ట్రేడ్ వర్గాలు కూడా ఇది లాభాల బాటలో కేవలం స్టార్ట్ మాత్రమే అంటున్నాయి. మొత్తానికి, మిరాయ్ సినిమా మొదటి రెండు రోజుల్లోనే అందించిన రికార్డులు, కలెక్షన్లు, ట్రెండ్ కలిపి ఇది ఒక పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలబడబోతోందని చెబుతున్నాయి.