ఆ పోస్ట్ ద్వారా తేజ హింట్ ఇచ్చాడా?
టాలీవుడ్ ప్రొడ్యూసర్ స్వప్న దత్ బర్త్ డే సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ తేజ ఓ ఫోటోతో పాటూ పోస్ట్ చేశారు. ఫోటో గురించి పక్కన పెడితే ఆ పోస్ట్ లో సీ యు ఇన్ కె అని రాయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
By: Sravani Lakshmi Srungarapu | 31 Aug 2025 11:41 AM ISTసినీ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేయకపోయినా చేసిన ప్రతీ సినిమాతో తమదైన ముద్ర వేసే నటులు కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో తేజ సజ్జ కూడా ఒకరు. సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకునే తేజ హను మాన్ సినిమాతో తన మార్కెట్ ను విపరీతంగా పెంచుకున్నారు. ప్రస్తుతం మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు తేజ.
మిరాయ్ ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా మంచు మనోజ్, శ్రియా శరణ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించింది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల లేటవుతూ ఎట్టకేలకు సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రానుంది. రీసెంట్ గానే మిరాయ్ ట్రైలర్ రిలీజవగా దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటూ మిరాయ్ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కూడా పెంచింది.
రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయగా తేజ సజ్జ ఆ ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొనడంతో పాటూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే తేజ సజ్జ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రీసెంట్ గా తేజ చేసిన ఇన్‌స్టా పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
కల్కి2లో తేజ?
టాలీవుడ్ ప్రొడ్యూసర్ స్వప్న దత్ బర్త్ డే సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ తేజ ఓ ఫోటోతో పాటూ పోస్ట్ చేశారు. ఫోటో గురించి పక్కన పెడితే ఆ పోస్ట్ లో సీ యు ఇన్ కె అని రాయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కె కె అంటే కల్కి 2898ఏడినే కదా అని అంటూ నెట్టింట ఆ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు. కల్కి సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయకముందు దాన్ని ప్రాజెక్టు కె అనే పిలిచిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తేజ కూడా అందరికీ హింట్ ఇస్తూ ఆ విషయాన్నే చెప్పారని కొందరంటుంటే, తేజ చెప్పేది మరో కొత్త ప్రాజెక్టు గురించి అయుంటుందని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ తేజ కల్కి సెకండ్ పార్ట్ లో ఉంటే మాత్రం ఆ సినిమాతో తేజ క్రేజ్ మరింత పెరిగే అవకాశముంటుంది. మరి తేజ చెప్పిన కె ఏంటనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. కాగా, తేజ ఇప్పుడు మరో సినిమాను కూడా మొదలుపెట్టారు. ప్రశాంత్ వర్మ తో కలిసి జాంబి రెడ్డి2 చేయనున్న తేజ ఆ సినిమాను 2027 జనవరిలో రిలీజ్ చేయనున్నారు.
