Begin typing your search above and press return to search.

మిరాయ్ అడుగు దూరంలో.. అద్భుతం చేస్తుందా..?

యువ హీరో తేజా సజ్జ ఏదో వచ్చామా సినిమాలు చేశామా అన్నట్టు కాకుండా తెలుగు తెర మీద కొత్త కథలను తన ద్వారా చెప్పాలని చూస్తున్నాడు.

By:  Ramesh Boddu   |   11 Sept 2025 10:41 AM IST
మిరాయ్ అడుగు దూరంలో.. అద్భుతం చేస్తుందా..?
X

యువ హీరో తేజా సజ్జ ఏదో వచ్చామా సినిమాలు చేశామా అన్నట్టు కాకుండా తెలుగు తెర మీద కొత్త కథలను తన ద్వారా చెప్పాలని చూస్తున్నాడు. జాంబి రెడ్డి తో సక్సెస్ అందుకుని హనుమాన్ తో అదరగొట్టాడు తేజ సజ్జ. హనుమాన్ తో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. అంతేకాదు యూఎస్ మార్కెట్ లో కూడా 5 మిలియన్ కలెక్షన్స్ తో రికార్డులు సృష్టించాడు. ఐతే హనుమాన్ తర్వాత మళ్లీ ఈసారి దాన్ని మించే సినిమా చేయాలని మిరాయ్ చేశాడు తేజ సజ్జ.

మిరాయ్ ప్రమోషన్స్ చూస్తేనే..

కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మిరాయ్ ప్రమోషన్స్ చూస్తేనే ఇదో కొత్త కథతో రాబోతుందని అర్ధమవుతుంది. ముఖ్యంగా సినిమా కోసం క్రియేట్ చేసిన ఆ వరల్డ్ బిల్డింగ్ అంతా కూడా ఆడియన్స్ కు నచ్చేస్తుందని అంటున్నారు. సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా బాగానే ఉంటుందనిపిస్తుంది. తేజ సజ్జ మిరాయ్ కథ.. విజువల్ ట్రీట్ పక్కా అని చెబుతున్నాడు. సినిమా మీద ఎంత కాన్ ఫిడెంట్ గా ఉంటే అతను అలా చెబుతాడన్నది అర్ధం చేసుకోవచ్చు.

ఒక్కోసారి మంచి కథ సెట్ అయినా తెరకెక్కించడంలో లోపాలు జరుగుతాయి. మిరాయ్ విషయంలో అలాంటి తప్పులు ఏమి జరగలేదని మేకర్స్ అంటున్నారు. హనుమాన్ తర్వాత సినిమా టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచడంతో మిరాయ్ ప్రీ రిలీజ్ బజ్ అదిరిపోయింది. బిజినెస్ కూడా టేబుల్ ప్రాఫిట్ తోనే జరిగిందట. ఇక జరగాల్సిందల్లా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడమే.

మిరాయ్ మరో 24 గంటల్లో..

తేజా సజ్జ మిరాయ్ మరో 24 గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అవగా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని తెలుస్తుంది. ఇంకా ఒక్కరోజు మాత్రం అంటే ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది తేజ సజ్జ మిరాయ్. మరి ఆడియన్స్ అంచనాలను అందుకుని అద్భుతాలు చేస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాలో మంచు మనోజ్ కూడా అదరగొట్టబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మించారు. మిరాయ్ సినిమా విజువల్స్ పరంగా టాప్ నాచ్ అనేలా ఉన్నాయి. ఇదే మ్యాజిక్ రేపు థియేటర్ లో చేస్తే కచ్చితంగా సినిమా తేజ సజ్జా కెరీర్ లో మరో హనుమాన్ అవుతుందని చెప్పొచ్చు.

తేజ సజ్జ కూడా అదే కాన్ ఫిడెన్స్ తో ఉన్నాడు. హనుమాన్ తర్వాత చాలా కథలు విన్నా కూడా మళ్లీ ఆ రేంజ్ సెటప్ తో వస్తున్న మిరాయ్ తో రావడమే తేజా సజ్జ ప్లానింగ్ ఏంటో తెలిసేలా చేస్తుంది.