Begin typing your search above and press return to search.

మిరాయ్ ఫస్ట్ డే బాక్సాఫీస్ రాంపేజ్.. ఎంతంటే?

యంగ్ హీరో తేజ సజ్జా కెరీర్ లో మరో బిగ్ రికార్డ్ అందుకుంటున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో హల్ చల్ చేస్తూ మిరాయ్ బాక్సాఫీస్ దగ్గర ఊహించని ఊచకోతను ప్రదర్శించింది.

By:  M Prashanth   |   13 Sept 2025 12:12 PM IST
మిరాయ్ ఫస్ట్ డే బాక్సాఫీస్ రాంపేజ్.. ఎంతంటే?
X

యంగ్ హీరో తేజ సజ్జా కెరీర్ లో మరో బిగ్ రికార్డ్ అందుకుంటున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో హల్ చల్ చేస్తూ మిరాయ్ బాక్సాఫీస్ దగ్గర ఊహించని ఊచకోతను ప్రదర్శించింది. ఇప్పటికే ట్రైలర్, పాటలు, ప్రమోషన్లతోనే భారీ అంచనాలు ఏర్పడగా సినిమా మొదటి రోజే ఆ అంచనాలను మించి దూసుకెళ్లింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది.

ఓవర్సీస్ ప్రీమియర్స్ తోనే సినిమా తేజ సజ్జా కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. నార్త్ అమెరికా లో మొదటి రోజే 700K డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, హనుమాన్ రికార్డును దాటేసింది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో గంటకు 20 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ కొనసాగడం గమనార్హం. ఈవెనింగ్, నైట్ షోల వరకు మరింత వేగం పెరిగి కలెక్షన్స్ ను డబుల్ డిజిట్ మార్క్ లోకి తీసుకెళ్లింది.

ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు చూసుకుంటే సినిమా 27 కోట్ల గ్రాస్ ను దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది తేజ సజ్జా కెరీర్ లోనే కాకుండా మిడిల్ రేంజ్ హీరోల సినిమాలకు కూడా అరుదైన రికార్డ్. మొదట 14-16 కోట్ల వరకు వస్తుందని అనుకున్న కలెక్షన్స్ చివరికి 20 కోట్లకు దగ్గరగా చేరడంతో ఎక్స్‌పెక్టేషన్స్ అంతా తారుమారయ్యాయి. ఓవర్సీస్ తో పాటు కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా మంచి వసూళ్లు సాధించింది.

హనుమాన్ సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్ లో ఊచకోత కోసిన తేజ సజ్జా, ఇప్పుడు మిరాయ్ తో తన మార్క్ ను మరింత బలంగా సెట్ చేసుకున్నాడు. హనుమాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపు 12 కోట్ల వరకు వచ్చి, తర్వాత 300 కోట్ల వరకూ దూసుకెళ్లింది. అదే రూట్ లో మిరాయ్ కూడా మొదటి రోజే 27 కోట్ల గ్రాస్ ను అందుకోవడంతో దీర్ఘకాలికంగా లాభాల వేట ఖాయమని ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి.

సినిమాలో తేజ సజ్జా ఎనర్జీ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా, మంచు మనోజ్ విలనిజం మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. శ్రీయ సరణ్ తల్లి పాత్రలో ఎమోషనల్ టచ్ ఇచ్చింది. కార్తీక్ ఘట్టమనేని టెక్నికల్ ప్రెజెంటేషన్, విజువల్స్, సౌండ్ డిజైన్ అన్నీ సినిమా లెవెల్ ను కొత్త ఎత్తుకు తీసుకెళ్లాయి. మొత్తం మీద, మిరాయ్ ఫస్ట్ డే 27 కోట్ల గ్రాస్ తో ఊహకందని ఊచకోత చూపించింది. రెండో రోజు నుంచి మరింత వేగం పెంచే అవకాశం ఉందని ట్రేడ్ టాక్. లాంగ్ రన్ లో ఇది తేజ సజ్జా కెరీర్ ని మరోస్థాయికి తీసుకెళ్లే బ్లాక్‌బస్టర్ గా నిలుస్తుందనే నమ్మకం పెరిగింది. మరి ఫైనల్ లెక్క ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.