నవతరం హీరోలో కొత్త ఉత్సాహం నింపిన దిల్ రాజు పార్టీ
సక్సెస్ చుట్టూ పాజిటివిటీ ఉంటుంది. ఫెయిల్యూర్ చుట్టూ నెగెటివిటీ ఉంటుంది. వరుస సక్సెస్ లతో తన చుట్టూ పాజిటివ్ వైబ్‌ని క్రియేట్ చేయడంలో సఫలమయ్యాడు తేజ సజ్జా.
By: Sivaji Kontham | 5 Oct 2025 5:04 PM ISTసక్సెస్ చుట్టూ పాజిటివిటీ ఉంటుంది. ఫెయిల్యూర్ చుట్టూ నెగెటివిటీ ఉంటుంది. వరుస సక్సెస్ లతో తన చుట్టూ పాజిటివ్ వైబ్‌ని క్రియేట్ చేయడంలో సఫలమయ్యాడు తేజ సజ్జా. ఈ యువకథానాయకుడు ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మీ కుటుంబాల నుంచి వచ్చిన హీరోలకు సైతం సాధ్యం కాని స్టార్ డమ్‌ని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. హనుమాన్ పాన్ ఇండియాలో విజయం సాధించిన తర్వాత `మిరాయ్` అంతకుమించి విజయం సాధించడం అతడి స్థాయిని మరింత పెంచింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది.
మిరాయ్ సాధించిన విజయానికి నివాళిగా, తెలంగాణ ఎఫ్.డి.సి. ఛైర్మన్, అగ్ర నిర్మాత దిల్ రాజు ఆ ఆనందాన్ని చిత్ర బృందం ఆస్వాధించేలా అద్భుతమైన పార్టీని ఇచ్చారు. ఈ సినిమాకి పని చేసిన నటీనటులు, సిబ్బందిలో ఇది ఆనందం నింపింది. ముఖ్యంగా యువహీరో తేజ సజ్జాకు ఇలాంటి ప్రోత్సాహకం బిగ్ బూస్ట్ గా పని చేస్తుందనడంలో సందేహం లేదు.
ఇటీవలి కాలంలో విడుదలైన హిందీ సూపర్ స్టార్ల సినిమాలు 100కోట్లు వసూలు చేసేందుకు నానా హైరానా పడుతున్నాయి. అక్షయ్ కుమార్ నటించిన జాలీ ఎల్.ఎల్.బి 2 ఇటీవల విడుదలై, కేవలం 120కోట్లు వసూలు చేసి చివరికి చతికిలబడింది. అక్షయ్, అర్షద్ లాంటి దిగ్గజ హీరోలు నటించినా ఉపయోగం లేకుండా పోయింది. అలాంటిది తేజ సజ్జా లాంటి అప్ కమ్ హీరో తన రెండో మూడో సినిమాకే ఏకంగా 150కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాడు. హనుమాన్ తర్వాత `మిరాయ్` చిత్రంతో అతడు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. హిందీ బెల్ట్ లో చాలా చోట్ల జాలీ ఎల్.ఎల్.బి వైదొలిగినా మిరాయ్ ఆడుతోంది. ఇప్పుడు యువహీరో చుట్టూ పాజిటివ్ వైబ్స్ పరిశ్రమ అగ్ర నిర్మాతల్లో ఉత్సాహం పెంచుతోంది.
అమెరికా నుంచి 26 కోట్లు:
తాజా సమాచారం మేరకు.. `మిరాయ్` ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అమెరికా ఓవర్సీస్ లో ఒక కొత్తతరం హీరోకి మిలియన్ డాలర్ క్లబ్ అనేది అసాధారణమైనది. 3 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 26కోట్లు. వాస్తవంగా గణిస్తే, ఇది ప్రముఖ ఫిల్మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హీరో పదేళ్ల కెరీర్ లో సాధించలేని ఉత్తమ విదేశీ వసూల్ గా రికార్డులకెక్కింది. మిరాయ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్‌ను దాటింది. తేజ సజ్జా చాలా మంది దిగ్గజ హీరోలకు ధీటుగా తెలుగు చిత్రసీమలో రాణిస్తున్నాడు. అతడి ఫేట్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో రాసి పెట్టి ఉంది. ప్రస్తుతం అగ్ర దర్శకనిర్మాతల కళ్లన్నీ తేజ సజ్జాపైనే ఉన్నాయి. ఒక యంగ్ రైజింగ్ స్టార్ ని వెన్నంటి నిలిచి ప్రోత్సహించాలనే మన నిర్మాతల సదుద్ధేశం మెచ్చదగినది.
