తేజ సజ్జా.. 150కి గురి పెట్టాడుగా..
అయితే ఈ సినిమా మూడవ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద సునామీలా దూసుకుపోతున్న విధానం చర్చనీయాంశంగా మారింది. ఓవర్సీస్‌లోనూ రికార్డు స్థాయిలో వసూళ్లు అందుకుంటోంది.
By: M Prashanth | 29 Sept 2025 12:24 PM ISTతెలుగు సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద కంటెంట్ తో ఎవరైనా బిగ్స్ హిట్స్ అందుకోవచ్చని నిరూపిస్తున్నాడు యువ హీరో తేజ సజ్జా. బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టి, క్రమంగా హీరోగా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ తెచ్చుకున్న అతను, వరుస విజయాలతో ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటుతున్నారు. హనుమాన్ తోనే బాక్సాఫీస్ వద్ద 350 కోట్ల మార్క్ ను అందుకున్నాడు. ఇక అదే కాన్ఫిడెన్స్ తో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో మరో హిట్ కొట్టేశాడు.
యువ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మూడవ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద సునామీలా దూసుకుపోతున్న విధానం చర్చనీయాంశంగా మారింది. ఓవర్సీస్‌లోనూ రికార్డు స్థాయిలో వసూళ్లు అందుకుంటోంది.
తాజా సమాచారం ప్రకారం, ఉత్తర అమెరికాలో ఈ సినిమా 3 మిలియన్ డాలర్ల మార్క్ దాటిందని అంచనా. అలాగే వరల్డ్‌వైడ్‌గా 150 కోట్ల గ్రాస్ వైపు దూసుకెళ్తోందని మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. గత వారంలో ఫెస్టివల్ హాలిడేలు లేకుండా కూడా ఇంత పెద్ద సక్సెస్ రావడంతో, ఈ సినిమాలోని కంటెంట్ బలం, తేజ సజ్జా క్రేజ్ ఎంత పెరిగిందో చెప్పేస్తోంది.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ విజయంతో తేజ సజ్జా అమెరికాలో బ్యాక్ టు బ్యాక్ 3 మిలియన్ గ్రాసర్స్ డాలర్లు ఇచ్చిన అరుదైన హీరో అయ్యాడు. టాప్ లీగ్ స్టార్స్ తప్ప మరెవ్వరూ సాధించని ఈ ఫీట్ సాధించడం అతనికి బిగ్ రికార్డ్. హనుమాన్ తర్వాత మళ్లీ మిరాయ్ తో కూడా అమెరికాలో ఇంతటి వసూళ్లు సాధించడం ఆయన బాక్సాఫీస్ స్టామినా స్పష్టంగా చూపించింది.
ఇక లేటెస్ట్ గా దసరా సెలవులు, కుటుంబ ప్రేక్షకుల మద్దతు, రిపీట్ ఆడియన్స్ వల్ల సినిమా రన్ మరింత బలపడింది. ముఖ్యంగా వైబ్ ఉంది పాట థియేటర్లలో అలరించి, షోలకి అదనపు ఉత్సాహం తెచ్చింది. సాంగ్ విజువల్స్, బిజీఎం, యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆడియన్స్ మరింత కనెక్ట్ అవుతున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మరోసారి తన విజన్ తో ఎట్రాక్ట్ చేశాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాణం కూడా ఈ సినిమాకి బలమైన అస్త్రం అయింది. భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ సినిమా, క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో పండగ మూడ్‌లోనే దూసుకెళ్తోంది. మొత్తం మీద, మిరాయ్ తో తేజ సజ్జా తన కెరీర్‌లో మరో గోల్డెన్ హిట్ అందుకున్నాడు. 150 కోట్ల గ్రాస్ వైపు దూసుకెళ్తున్న ఈ సినిమా, ఆయనకు ఓ పక్కా మార్కెట్ సెట్ చేస్తుందని టాక్.
