Begin typing your search above and press return to search.

తేజ సజ్జా 'మిరాయ్'.. రన్ టైమ్ ఎంతంటే?

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్ లో నటించిన మిరాయ్ మూవీ.. ఇప్పుడు మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   5 Sept 2025 11:23 PM IST
తేజ సజ్జా మిరాయ్.. రన్ టైమ్ ఎంతంటే?
X

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్ లో నటించిన మిరాయ్ మూవీ.. ఇప్పుడు మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సినిమాలో తేజ సూపర్ యోధగా కనిపించనున్నారు. సూపర్ హీరో జోనర్ లో రానున్న ఆ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

మంచు మనోజ్ విలన్ గా కనిపించనున్నారు. జగపతి బాబు, శ్రియా శరన్, జయరాం తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. విజువల్ వండర్ గా సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఆ సినిమాకు గౌర హరి మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటికే మిరాయ్ పై ఆడియన్స్, ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సహా ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది.. అందుకుంటోంది.. సామ్రాట్ అశోకుడు కాలానికి చెందిన తొమ్మిది గ్రంథాల చుట్టూ సినిమా కథ తిరుగుతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. దీంతో మూవీ కోసం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అదే సమయంలో పాన్ ఇండియా రేంజ్ లో సినిమా విడుదల కానుంది. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న మిరాయ్.. రిలీజ్ కు కూడా రెడీ అవుతుంది. రీసెంట్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి U/A సర్టిఫికేట్ పొందింది. దాన్ని ధృవీకరిస్తూ మేకర్స్ అంచనాలు పెంచారు.

సినిమాలోని కంటెంట్, విజువల్స్ ప్రతి ప్రేక్షకుడిని కచ్చితంగా ఆకట్టుకుంటాయిని ధీమా వ్యక్తం చేశారు. అయితే సినిమాకు మొత్తం రన్ టైమ్ ను 169 నిమిషాలు (అంటే 2 గంటల 49 నిమిషాలు) గా లాక్ చేశారు. దీంతో ఆడియన్స్ కు రెండు గంటలకు పైగా ఒక అద్భుతమైన విజువల్ జర్నీ ఉండనుందన్నమాట. మిరాయ్ ది క్రిస్పీ రన్ టైమ్ అనే చెప్పాలి.

కాగా.. తేజ సజ్జా ఇప్పటికే హనుమాన్ మూవీతో బ్లాక్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఆ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో అలరించారు. భారీ వసూళ్లను రాబట్టారు. ఇప్పుడు మిరాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరి మంచి అంచనాల మధ్య రిలీజ్ అవ్వనున్న ఆ మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటారో తెలియాలంటే వేచి చూడాలి.