Begin typing your search above and press return to search.

తేజ సజ్జా 'మిరాయ్'.. ఓవర్సీస్ లో వేరే లెవెల్!

ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్స్ లో అదరగొట్టిన మిరాయ్.. ఇప్పుడు మరింత ఊపుతో సందడి చేస్తోంది.

By:  M Prashanth   |   14 Sept 2025 11:29 AM IST
తేజ సజ్జా మిరాయ్.. ఓవర్సీస్ లో వేరే లెవెల్!
X

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్ లో నటించిన మిరాయ్ మూవీ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సూపర్ హీరో జోనర్ లో ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా వేరే లెవెల్ లో సందడి చేస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన మిరాయ్.. ఓవర్సీస్ లో కూడా సత్తా చాటుతోంది.


ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్స్ లో అదరగొట్టిన మిరాయ్.. ఇప్పుడు మరింత ఊపుతో సందడి చేస్తోంది. కేవలం రెండు రోజుల్లో మిలియన్ డాలర్స్ క్లబ్ లో అడుగుపెట్టింది. విదేశాలలో విడుదలైన తెలుగు సినిమాల్లో అసాధారణ మైలురాయిగా నిలిచింది. తేజ సజ్జా కెరీర్ లో ఆ ఫీట్ సాధించిన రెండో సినిమాగా కూడా మిరాయ్ నిలిచింది.

ఇప్పటికే హనుమాన్ తో తేజ సజ్జా.. ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ ఘనత సాధించారు. ఇప్పుడు మళ్లీ మిరాయ్ తో కూడా అందుకున్నారు. అయితే రికార్డు సమయంలో మిలియన్ డాలర్ల మైలురాయిని దాటడమే కాకుండా.. అమెరికాలో దాదాపు వెంటనే బ్రేక్ ఈవెన్‌ ను సాధించి మరో అరుదైన ఫీట్ ను కూడా సాధించింది.

అయితే అద్భుతమైన సమీక్షలు, స్ట్రాంగ్ పాజిటివ్ టాక్ తో మిరాయ్ మూవీ.. ఓవర్సీస్ లో మరిన్ని వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది. విదేశాల్లో తెలుగు సినిమాకు కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందని సమచారం. తెలుగు సినిమా గర్వించదగ్గ క్షణాలను మిరాయ్ సృష్టించేలా ఉంది. తేజ సజ్జా స్టార్ ఇమేజ్ ను కూడా పెంచనుంది.

ఇక మిరాయ్ మూవీ విషయానికొస్తే.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఆ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించగా.. మంచు మనోజ్ విలన్ గా కనిపించారు. శ్రియా శరన్, జగపతిబాబు, జయరాం తదితరులు కీలక పాత్రలు పోషించారు.

గౌర హరి మ్యూజిక్ అందించగా.. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 12న సినిమా విడుదలైంది. వాటిని అందుకుని మంచి విజయాన్ని సాధించింది. అద్భుతమైన వీఎఫ్ ఎక్స్ వర్క్, గ్రాండ్ విజువల్స్, స్టోరీ ప్రెజెంటేషన్, తేజ సజ్జా ఆకర్షణీయమైన సూపర్ హీరో నటన, మనోజ్ విలనిజానికి అంతా ఫిదా అయ్యారు. సినిమాకు బ్రహ్మరథం కూడా పట్టారు!