Begin typing your search above and press return to search.

తేజ సజ్జా మరో బ్లాక్ బస్టర్ పడితే మాత్రం..?

ఆ తర్వాత ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ తో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు తేజా సజ్జ.

By:  Ramesh Boddu   |   30 Aug 2025 9:00 PM IST
తేజ సజ్జా మరో బ్లాక్ బస్టర్ పడితే మాత్రం..?
X

చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అందరు కూడా పెద్దయ్యాక హీరోగా సక్సెస్ అవుతారని చెప్పడం కష్టం. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అనుభవంతో ఆ పరిచయాలతో అవకాశాలు వస్తాయి కానీ అది లీడ్ రోల్ గానా లేదా అన్నది చూసుకోవాలి. ఐతే ఒకటి రెండు ఛాన్స్ లు వచ్చినా వాటిలో తమ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి అలా లీడ్ అవకాశాలను అందుకోవాలి. ఐతే అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి హీరోగా మారి పాన్ ఇండియా లెవెల్ లో అదరగొడుతున్నాడు తేజా సజ్జ. ఓ బేబీ లో నటించిన అతను జాంబి రెడ్డితో సక్సెస్ అందుకున్నాడు.

హనుమాన్ తో పాన్ ఇండియా హిట్..

ఆ తర్వాత ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ తో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు తేజా సజ్జ. ఐతే ఆ రేంజ్ హిట్ పడింది కదా అని పొంగిపోకుండా సైలెంట్ గానే ఉంటున్నాడు. ఐతే నెక్స్ట్ అతను మిరాయ్ తో వస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కూడా చాలా పెద్ద కథతోనే వస్తుంది. మిరాయ్ ట్రైలర్ చూస్తేనే మన టికెట్ వర్తబుల్ అనిపించేలా విజువల్స్ ఉన్నాయనిపిస్తుంది.

తేజా సజ్జ స్టోరీ సెలక్షన్ అదిరిపోతుంది. అతన్ని ఇలాంటి సినిమాలే చేస్తాడని డైరెక్టర్స్ ఫిక్స్ అయ్యారో లేదా తేజా ఇలాంటి సినిమాలే చేయాలని అనుకుంటున్నాడో తెలియదు కానీ తేజా సజ్జా మాత్రం మంచి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. మిరాయ్ ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే కచ్చితంగా సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంది.

తేజా సజ్జ మార్కెట్..

మరి తేజా సజ్జ ఖాతాలో మిరాయ్ రూపంలో మరో బ్లాక్ బస్టర్ పడితే మాత్రం యువ హీరో మార్కెట్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి సినిమాల్లోనే ఉంటూ వచ్చిన తేజా ఎలాంటి కథలు ఎంచుకోవాలి అన్న పర్ఫెక్ట్ థింకింగ్ ఉంది. అందుకే సూపర్ హీరో కథలతో ఆడియన్స్ కి మంచి ఫీస్ట్ అందించేస్తున్నాడు. హనుమాన్ తోనే అదరగొట్టిన తేజ మిరాయ్ తో మరో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు.

సినిమా ట్రైలర్ తో అంచనాలు డబుల్ అయ్యాయి. తప్పకుండా తేజా సజ్జ మళ్లీ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారబోతున్నాడని చెప్పొచ్చు. సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతున్న మిరాయ్ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.