Begin typing your search above and press return to search.

యువ హీరోల్లో అత‌డో సంచ‌ల‌న‌మే!

ప్రస్తుతం టాలీవుడ్ యువ హీరోల్లో తేజ సజ్జా ఓ సంచ‌ల‌నం. బాలనటుడిగా న కెరీర్‌ను ప్రారంభించిన తేజ‌ హీరోగా మారి త‌నకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.

By:  Srikanth Kontham   |   21 March 2026 4:00 PM IST
యువ హీరోల్లో అత‌డో సంచ‌ల‌న‌మే!
X

ప్రస్తుతం టాలీవుడ్ యువ హీరోల్లో తేజ సజ్జా ఓ సంచ‌ల‌నం. బాలనటుడిగా న కెరీర్‌ను ప్రారంభించిన తేజ‌ హీరోగా మారి త‌నకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా అత‌డి కథల ఎంపిక విషయంలో చూపిస్తున్న చొరవ, కొత్తదనం కోసం చేసే ప్రయత్నాలు యువ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అందరూ రొటీన్ కమర్షియల్ కథల వైపు వెళ్తుంటే? తేజ సజ్జా మాత్రం ప్రయోగాత్మక చిత్రాలతో తనదైన ముద్ర వేస్తున్నాడు.

తేజ కెరీర్ గ్రాఫ్ గమనిస్తే? ఆయన జర్నీ ఎంత యూనిక్‌గా ఉందో అర్థమవుతుంది. `జాంబీ రెడ్డి` వంటి వైవిధ్యమైన జోనర్‌తో హీరోగా నిలదొక్కుకున్నాడు. అటుపై `హను-మాన్` చిత్రంతో పాన్-ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించాడు. ఆడియన్స్‌ను ఆకట్టుకునే కథలను ఎంచుకోవడంలో అత‌డి విజన్ మాత్ర‌మే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ హీరోగా నిలబెట్టింది. ఓ స్టార్ హీరో స్థాయి క్రేజ్ తెచ్చుకున్నా? అహం ప్రదర్శించకుండా కంటెంట్‌కు ప్రాధాన్య తనివ్వడం ఆయన సక్సెస్ సీక్రెట్ గా చెప్పొచ్చు.

తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ఎంతో క్రేజ్ ఉన్న రియాలిటీ షో `ది ట్రైటర్స్` తెలుగు వెర్షన్‌కు తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా స్టార్ హీరోలు హోస్టింగ్‌కు దూరంగా ఉంటారు, కానీ తేజ సజ్జా మాత్రం తన కంఫర్ట్ జోన్‌ను దాటి ఇలాంటి డిఫరెంట్ షోలకు సై అనడం ఆయనలోని సాహసోపేతమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నిర్ణయం ఆయన ఫ్యాన్ బేస్‌ను మరింత విస్తృతం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. `ది ట్రైటర్స్` వంటి సైకలాజికల్ గేమ్ షోకి తేజ సజ్జా హోస్ట్ కావడం వెనుక ఒక వ్యూహం ఉందనిపిస్తోంది.

కంటెస్టెంట్ల మధ్య ఉండే అబద్ధాలు, వ్యూహాలను పర్యవేక్షించే పాత్రలో ఆయన ఎలా రాణిస్తారనేది? ప్రేక్షకులలో భారీ ఉత్కంఠను రేపుతోంది. ఆయన కెరీర్‌లో సినిమాలు ఒక ఎత్తు అయితే? ఇలాంటి రియాలిటీ షోలు మరో ఎత్తు. ఇది తన పర్సనాలిటీని ప్రేక్షకులకు మరింత దగ్గరగా చూపే అద్భుతమైన అవకాశమిది. తేజ సజ్జా ఎంచుకునే ప్రతి ప్రాజెక్ట్ వెనుక ఒక క్వాలిటీ ఉంటుంది. అది సినిమా కావచ్చు ? రియాలిటీ షో కావచ్చు. ప్రతిదీ తన కెరీర్‌ను ఉన్నత స్థానంలో నిలబెట్టేలాగే తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నాడు. కథల విషయంలో అత‌డి చూపించే జాగ్రత్తలే ఈరోజు ఆయనను టాలీవుడ్‌లో నమ్మదగ్గ హీరోగా మార్చాయి. నిర్మాతలు , దర్శకులు కూడా తేజకు కథ చెప్పేటప్పుడు ఎంతో ధైర్యంగా ఉంటున్నారు. కొత్త క‌థ‌లైనా స్వాగ‌తిస్తాడు అన్న ధీమాను న‌వ‌త‌రం ర‌చ‌యిత‌ల్లో క‌లిగిస్తున్నాడు.

తేజ సజ్జా జర్నీ కేవలం సక్సెస్ మాత్రమే కాదు. న‌వ‌తారానికి ఓ స్ఫూర్తి. తనను తాను నిరంతరం కొత్తగా ఆవిష్కరించుకుంటూ ప్రతి అడుగులోనూ కొత్త సవాళ్లను స్వీకరించడం అత‌డి ప్రత్యేకత. `ది ట్రైటర్స్` ద్వారా హోస్ట్‌గా కూడా తన సత్తా చాటడానికి సిద్ధమైన తేజ భవిష్యత్తులో టాలీవుడ్ టాప్ లీగ్‌లో స్థిరపడటం ఖాయమని చెప్పొచ్చు. యువ హీరోల్లో ఇటువంటి ప్రయోగాత్మక ఆలోచనాపరుడు ఉండటం తెలుగు సినిమాకు ప్లస్ అనే చెప్పాలి.