నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్..వారసుడిని పరిచయం చేస్తున్న తేజ
తేజ తనయుడు అమితోవ్ తేజని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమా మొదలు పెడుతున్నారట.
By: Ramesh Boddu | 16 Aug 2025 1:01 PM ISTటాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ అయిన తేజ అహింస తర్వాత అసలైతే రానతో ఒక మూవీ ప్లాన్ చేశాడు కానీ అది ఎందుకో సెట్స్ మీదకు వెళ్లలేదు. రాక్షస రాజు అనే టైటిల్ తో ఈ సినిమా చేయాలని అనుకున్నారు. తేజ రాసిన ఫైనల్ వెర్షన్ తో రానా అన్ సాటిస్ఫై అవ్వడంతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఇక లేటెస్ట్ గా తేజ తన తనయుడినే హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమా చేయబోతున్నారట.
వారసుడిని పరిచయం చేస్తున్న తేజ..
తేజ తనయుడు అమితోవ్ తేజని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమా మొదలు పెడుతున్నారట. అంకితోవ్ తేజ ఇప్పటికే యాక్టింగ్ కోర్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మామూలుగానే తేజ సినిమాల్లో కొత్త వాళ్లతోనే అదిరిపోయే అవుట్ పుట్ తీసుకొస్తాడు. అలాంట్ తేజ తనయుడితో సినిమా ఏం చేస్తాడన్నది చూడాలి. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా కూడా స్టార్ కిడ్ ని తీసుకొస్తున్నారట. తేజ తనయుడు హీరోగా రాబోతున్న సినిమాలో ఘట్టమనేని వారసురాలు హీరోయిన్ గా చేసే ఛాన్స్ ఉందట.
సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, రమేష్ బాబు కూతురు ఘట్టమనేని భారతిని అమితోవ్ కి జోడీగా చేసే ప్రయత్నాలు చేస్తున్నాడట తేజ. సో తేజ తనయుడి తెరంగేట్రంతో పాటు రమేష్ బాబు కూతురు కూడా ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తుంది. రమేష్ బాబు దూరమైనా సరే ఆ ఫ్యామిలీకి మహేష్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటూ వస్తుంది.
లవ్ స్టోరీ తో తేజ..
ఇక భారతి ఎంట్రీకి కచ్చితంగా మహేష్ ప్రోత్సాహం ఉంటుందని చెప్పొచ్చు. తేజ డైరెక్షన్ లో సినిమా కాబట్టి ఆమెకు మంచి రోల్ పడే ఛాన్స్ ఉంటుంది. ఐతే ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ బయటకు రావాల్సి ఉంది. తేజ మాత్రం ఈసారి తనయుడి సినిమాతో మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. మరి డైరెక్టర్ తేజ తనయుడు హీరోగా మెప్పిస్తాడా లేదా అన్నది చూడాలి.
రానా తో సినిమా మిస్ చేసుకున్న తేజ కొద్దిగా టైం తీసుకుని మరీ తన వారసుడితో సినిమాకు రెడీ అవుతున్నాడు. కొత్త హీరో, కొత్త హీరోయిన్ కాబట్టి కచ్చితంగా ఈ సినిమా కూడా లవ్ స్టోరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తేజ లవ్ స్టోరీ తీశాడంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. అమితోవ్ తో భారతి ఈ కాంబో సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది.
