Begin typing your search above and press return to search.

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. హీరోయిన్ లో హిడెన్ టాలెంట్ !

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. ప్రీమియర్ షోలు చూసిన తర్వాత ఎక్కడ చూసినా.. ఏ నోట విన్నా ఈ సినిమా గురించే వార్తలు వినిపిస్తున్నాయి.

By:  Madhu Reddy   |   6 Nov 2025 3:37 PM IST
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. హీరోయిన్ లో హిడెన్ టాలెంట్ !
X

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. ప్రీమియర్ షోలు చూసిన తర్వాత ఎక్కడ చూసినా.. ఏ నోట విన్నా ఈ సినిమా గురించే వార్తలు వినిపిస్తున్నాయి. చిన్న సినిమానే అయినా మంచి కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రీమియర్ షో టాక్ బాగుంది. ఇకపోతే ఈ సినిమా రేపు థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించగా.. అందులో హీరోయిన్ కంటెంట్ తోనే కాదు కవిత్వంతో కూడా అందరిని ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.

ప్రెస్ మీట్ లో భాగంగా టీనా శ్రావ్య మాట్లాడుతూ.. "కమిటీ కుర్రోళ్ళు సినిమాలోని నన్ను ఎంపిక చేసినందుకు రాహుల్ శ్రీనివాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను. అయితే ఎందుకు నన్ను ఎంపిక చేసుకున్నారనే విషయం అప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా చూశాక ఎందుకు నన్ను ఎంపిక చేసుకున్నారో అర్థం అయింది. ఇందులో హేమా పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశానని అనుకుంటున్నాను" అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.

అలాగే ఒక కవిత్వాన్ని కూడా చెబుతూ.. "దేవుడా ఒక మంచి తెలుగు ప్రేక్షక దేవుడా.. బ్యాక్ గ్రౌండ్ చూడకుండా ఎంకరేజ్ చేస్తావ్.. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సినిమాను ఎంకరేజ్ చేస్తావ్.. అలాగే మా ప్రీ వెడ్డింగ్ షో చూసి ఎంకరేజ్ చేస్తావని కోరుకుంటున్నా.. మన ఆంధ్ర , తెలంగాణలో ఉన్న 12 కోట్ల మందికి (నంబర్ తప్పయితే క్షమించండి). ఎంతమంది ఉంటే అంతమందికి.. ఓవర్సీస్ లో ఉన్న (నంబర్ కరెక్ట్ గా తెలియదు) ఎంతమంది ఉంటే అంతమందికి నువ్వు సినిమా చూసి.. సినిమా రీచ్ అయ్యేలా చూడు.. నాకు తెలుసు ఈ సినిమా రీచ్ అయ్యేలా చేస్తావ్.. ఎందుకంటే నువ్వు ఒక మంచి ప్రేక్షకుడివి" అంటూ తన సినిమాను చాలా అద్భుతంగా ప్రమోట్ చేసింది టీనా..

ఇకపోతే వెంకటేష్ , ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలోని డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చే సీన్ ను తన ప్రీ వెడ్డింగ్ షో వెర్షన్ లోకి మార్చుకొని చాలా అద్భుతంగా టీనా తన సినిమాను ప్రమోట్ చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ది ప్రీ వెడ్డింగ్ షో సినిమా విషయానికి వస్తే.. పలాస, మసూద, పరేషాన్ వంటి చిత్రాలలో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ హీరోగా.. టీనా శ్రావ్య హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ఇది. రోహన్ రాయ్ కీలక పాత్రలో వస్తున్న ఈ సినిమా నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 7PM బ్యానర్ పై సందీప్ ఆగారం, అశ్విత రెడ్డి నిర్మిస్తున్నారు.