Begin typing your search above and press return to search.

ఆ సినిమాపై టీమిండియా క్రికెటర్స్ ఆసక్తి.. అంతలా ఏం నచ్చిందబ్బా?

టీ20 మ్యాచ్.. డిసెంబర్ 17న టీం ఇండియా దక్షిణ ఆఫ్రికా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది అన్న విషయం అందరికీ తెలిసిందే.

By:  Madhu Reddy   |   17 Dec 2025 11:16 PM IST
ఆ సినిమాపై టీమిండియా క్రికెటర్స్ ఆసక్తి.. అంతలా ఏం నచ్చిందబ్బా?
X

టీ20 మ్యాచ్.. డిసెంబర్ 17న టీం ఇండియా దక్షిణ ఆఫ్రికా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఆడబోయే ఆటగాళ్లపైన ప్రెజర్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాగైనా సరే గెలవాలి అని ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్నారు. అభిమానుల కోరికను నెరవేర్చడానికి ఇటు టీమిండియా ఆటగాళ్లు ఏ రేంజ్ లో మానసిక ఒత్తిడి అనుభవిస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే ఆ టెన్షన్ నుండి వారికి కాస్త రిలాక్సేషన్ అందించడం కోసం చేసిన పని అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రత్యేకించి టీమిండియా ఆటగాళ్లు ఏం చేశారనే విషయానికొస్తే ఇటీవల విడుదలైన రణ్ వీర్ సింగ్ ధురంధర్ సినిమాను వీక్షించారు.

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా వచ్చిన చిత్రం ఇది. ఇప్పటికే 400 కోట్లకు చేరువలో కొనసాగుతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, అర్జున్ రాంపాల్ , ఆర్ మాధవన్, సంజయ్ దత్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇకపోతే టి20 మ్యాచ్ ఈరోజు జరగనున్న నేపథ్యంలో సోమవారం రోజునే అంటే డిసెంబర్ 15న రిలాక్స్ మోడ్ లో ఆటగాళ్లను ఉంచడానికి వీరి కోసం ఏకంగా థియేటర్ ని బుక్ చేయించారు. ఇకపోతే టి20 మ్యాచ్ కోసం టీం ఇండియా ఆటగాళ్లు లక్నో చేరుకోగా అందులో భాగంగానే లక్నోలోని ఒక మల్టీప్లెక్స్ లో ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు..సోమవారం రాత్రి 8:10 గంటలకు టీమిండియా ఆటగాళ్ల కోసం షో బుక్ చేశారు.

అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ శుభ్ మాన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్, తిలక్ వర్మ, అర్ష్ దీప్ సింగ్ తదితర క్రికెటర్లు ఈ సినిమా చూసి ఆనందించారు. ఇకపోతే భద్రత కారణాల రీత్యా టీమిండియా ఆటగాళ్లు, సిబ్బందిని తప్ప ఇంకొకరిని ఈ స్క్రీనింగ్ లోకి అనుమతించలేదు. ముఖ్యంగా ఆటగాళ్ల సౌలభ్యం కోసమే మొత్తం థియేటర్ ను బుక్ చేశారని మల్టీప్లెక్స్ నిర్వాహకులు కూడా స్పష్టం చేశారు.

ఇకపోతే ప్రత్యేకించి టీం ఇండియా ఆటగాళ్లు మైండ్ ను రిఫ్రెష్ చేసుకోవడానికి రీసెంట్ గా విడుదలైన ఈ సినిమాను ఎంచుకోవడం జరిగింది.. పాకిస్తాన్లో భారత గూడచారులు నిర్వహించిన ఒక సీక్రెట్ ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. వాస్తవ సంఘటనలకి కొన్ని కల్పిత కథలను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా నిజజీవిత ఘటన ఆధారంగా తెరకెక్కడంతోనే టీమ్ ఇండియా ఆటగాళ్లు ఈ సినిమా చూడడానికి ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. ఇకపోతే టీం ఇండియా ఆటగాళ్లు ఈ సినిమాను చూడడంతో ఇప్పుడు ఈ సినిమాకి మరింత క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. ఆదిత్య ధార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.