భారతదేశం గర్వించేలా.. హాలీవుడ్ నటి వధువు గెటప్
పాశ్చాత్య దేశాల వివాహాలలో కూడా సాంప్రదాయం ఉంటుంది. కానీ భారతీయ సాంప్రదాయంలో పెళ్లి వేరు.
By: Sivaji Kontham | 3 Sept 2025 4:19 PM ISTపాశ్చాత్య దేశాల వివాహాలలో కూడా సాంప్రదాయం ఉంటుంది. కానీ భారతీయ సాంప్రదాయంలో పెళ్లి వేరు. అందమైన చీరకట్టు, కాంబినేషన్ బ్లౌజ్, మెడలో బంగారు ఆభరణాలు, చేతికి అందమైన గాజులు, జడ నిండుగా తురిమిన పూలు.. ఈ తరహా వేషధారణ వేరు.
అలాంటి ఒక వేషధారణతో హాలీవుడ్ హీరోయిన్ ని ఊహించుకోండి. ఒక భారతీయ నవవధవును తలపించే వేషధారణతో ప్రముఖ హాలీవుడ్ నటి టేలర్ స్విఫ్ట్ ని ఊహించుకోండి. ఆ గమ్మత్తయిన అనుభవమే వేరుగా ఉంటుంది. జడలో పూలు తురమడానికి కుదరలేదు కానీ, ఇలా చీర కట్టులో ఎంత ముగ్ధమనోహరంగా కనిపిస్తోందో కదా.. నవ వధువు పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి వేషధారణలో కనిపిస్తే ఆ లుక్కే వేరుగా ఉంటుంది.
ఇటీవలే తాను వరించిన ట్రావిస్ కెల్స్ ని పెళ్లాడితే ఇలా ఉంటుంది అంటూ కొన్ని ఫోటోలు వైరల్ చేసారు. అయితే ఇవన్నీ ఏఐలో రూపుదిద్దుకున్నవి. టేలర్ స్విఫ్ట్ భారతీయ వధువు వేషధారణలో ఎలా ఉంటుందో ఊహించి ఇలా చీరకట్టులో డిజైన్ చేయగా ఈ లుక్కు అందరికీ ఇట్టే కనెక్టయిపోయింది. భారతీయ సాంప్రదాయ వివాహాలను ప్రపంచం మొత్తం ఇష్టపడుతుంది. గౌరవిస్తుంది. అందుకే ఇప్పుడు ప్రముఖ హాలీవుడ్ నటి నవ వధువుగా మారితే! అనే కాన్సెప్టు బాగా వర్కవుటైంది.
టేలర్ స్విఫ్ట్ మొత్తం మూడు పెళ్లి అవతారాలలో కనిపించింది. ఎరుపు బ్లౌజ్- నీలిరంగు చీర, తోట సెటప్‌లో రాయల్ బ్లూ లెహంగా, సంప్రదాయాన్ని ఎలివేట్ చేసే క్లాసిక్ ఎరుపు లెహంగాలో కనిపించింది. చూడగానే దేశీ గాళ్ అంటూ మురిసిపోయేంత అందంగా ఉంది టేలర్.టేలర్ - ట్రావిస్ ఆగస్టు 26న తమ నిశ్చితార్థాన్ని బహిరంగంగా ప్రకటించారు. 2023లో ఈ సంబంధం మొదలైందని ప్రకటించారు. అందువల్ల ఇవన్నీ కేవలం ఊహాజనిత ఫోటోలు మాత్రమే.
