Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు నిశ్చితార్థం చేసుకున్న టేలర్ స్విఫ్ట్.. రింగ్ ఖరీదు, ప్రత్యేకతలు తెలిస్తే షాక్!

ఈమె ఒక ప్రముఖ పాప్ సింగర్..తాజాగా తన చిరకాల ప్రియుడితో పెళ్లికి రెడీ అయిపోయింది.

By:  Madhu Reddy   |   28 Aug 2025 3:00 AM IST
ఎట్టకేలకు నిశ్చితార్థం చేసుకున్న టేలర్ స్విఫ్ట్.. రింగ్ ఖరీదు, ప్రత్యేకతలు తెలిస్తే షాక్!
X

ఈమె ఒక ప్రముఖ పాప్ సింగర్..తాజాగా తన చిరకాల ప్రియుడితో పెళ్లికి రెడీ అయిపోయింది. అలా తన ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫొటోలని ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో.. ఈ ఫొటోస్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. అయితే వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోల కంటే ఎక్కువగా ఆమె చేతి వేలికి పెట్టుకున్న రింగే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది. ఎందుకంటే ఆ రింగ్ విలువ ఏకంగా రూ.4.8కోట్లు.. అయితే రూ.4.8 కోట్ల ఖరీదు చేసే ఆ రింగులో ఉన్న స్పెషాలిటీ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

తాజాగా పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ తన ప్రియుడు అయినటువంటి ఫుట్ బాల్ ప్లేయర్ ట్రావిస్ కెల్సీతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలతో పాటు మరొక విషయం అందర్నీ ఆకట్టుకుంటుంది. అదే టేలర్ వేలికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగు. అయితే ఆ రింగుని చాలా స్పెషల్ గా తయారు చేయించారట ప్రియుడు ట్రావిస్ కెల్సీ .. మరి ఆ రింగులో ఉన్న ప్రత్యేకతలు ఏంటయ్యా అంటే.. 7 నుంచి 10 క్యారెట్ల బరువున్న అరుదైన ఓల్డ్ మైన్ బ్రిలియంట్ కట్ వజ్రాన్ని ఆ రింగ్ మధ్యలో పొదిగి ఉంచారు.అలాగే ఆ వజ్రం చుట్టూ 18 క్యారెట్ల బంగారంతో రింగు మొత్తాన్ని తయారు చేయించారు.

అయితే ఆ రింగ్ మధ్యలో ఉన్న వజ్రం చాలా పురాతనమైనదని తెలుస్తోంది. అంతేకాదు 7-10 క్యారెట్ల బరువు ఉన్న ఆ వజ్రం ఇప్పటిది అయితే కాదని పురాతన కాలంలోని విక్టోరియా యుగానికి చెంది ఉంటుందని కొంతమంది ఆభరణాలు తయారు చేసే వ్యాపారులు అంటున్నారు. ఇలాంటి వజ్రం ఇదివరకు ఎప్పుడూ చూడలేదని.. అది విక్టోరియా యుగానికి చెందినది అని తేల్చేస్తున్నారు. ఇక ఈ అరుదైన వజ్రం పొదిగించిన ఈ ఉంగరాన్ని స్పెషల్ గా న్యూయార్క్ కి చెందిన ఆర్టిఫెక్స్ ఫైన్ జ్యూవెల్లరీ తో కలిసి స్పెషల్ గా చేయించారట ట్రావీస్ కెల్సీ.

అయితే ఈ ఉంగరంలోని వజ్రం దాదాపు 20 క్యారెట్లు ఉంటుంది అని.. ప్రముఖ జ్యువెలరీ వ్యాపారి అయినటువంటి జార్జ్ ఖలీఫ్ అంచనా వేశారు. అలా టేలర్ స్విఫ్ట్, ట్రావీస్ కెల్సీ ఎంగేజ్మెంట్లో ప్రియురాలికి తొడిగిన ఉంగరం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు నేను నిన్ను కాగితపు ఉంగరాలతో పెళ్లి చేసుకుంటాను అని ఒకప్పుడు పాట పాడిన సింగర్ టేలర్ ఇప్పుడు 4.8 కోట్ల విలువ చేసే కాస్ట్లీ రింగు తో నిశ్చితార్థం చేసుకుంది అంటూ ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.