Begin typing your search above and press return to search.

OG విల‌న్ ఇమ్రాన్ హ‌ష్మి తాజా సెన్షేష‌న్ ఇదే

ఇమ్రాన్ హష్మీ నటించిన `తస్కరీ: ది స్మగ్లర్స్ వెబ్` అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తోంది.

By:  Sivaji Kontham   |   22 Jan 2026 11:48 AM IST
OG విల‌న్ ఇమ్రాన్ హ‌ష్మి తాజా సెన్షేష‌న్ ఇదే
X

భారతీయ వెబ్ సిరీస్ చరిత్రలో చాలా కొత్త ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫ్యామిలీమ్యాన్, స్పెష‌ల్ ఓపీఎస్ మొద‌లు చాలా క్రియేటివ్ వెబ్ సిరీస్ లకు గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కింది. ఇప్పుడు ఒక అసాధార‌ణ వెబ్ సిరీస్ గురించి చాలా చ‌ర్చ సాగుతోంది. ఇమ్రాన్ హష్మీ నటించిన `తస్కరీ: ది స్మగ్లర్స్ వెబ్` అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తోంది.

ఈ సిరీస్ చారిత్రాత్మక రికార్డు గురించి స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10 (నాన్-ఇంగ్లీష్) లిస్ట్‌లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్న మొదటి భారతీయ వెబ్ సిరీస్‌గా `తస్కరీ` చరిత్ర సృష్టించింది. టాప్ 10లో వేరొక భార‌తీయ వెబ్ సిరీస్ ఏదీ కూడా లేదు. గతంలో సేక్రేడ్ గేమ్స్, హీరామండి'వంటి పెద్ద సిరీస్‌లు కూడా సాధించలేని ఘనతను ఇది సాధించింది.

జుజుట్సు కైసెన్‌ను కూడా అధిగ‌మించింది. ప్రముఖ జపనీస్ యానిమే సిరీస్ `జుజుట్సు కైసెన్` వంటి అంతర్జాతీయ హిట్‌లను కూడా వ్యూస్‌లో వెనక్కి నెట్టి ఈ సిరీస్ అగ్రస్థానంలో నిలిచింది. జనవరి 12-18 వారానికి గాను ఈ సిరీస్ సుమారు 5.4 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇది కొరియన్ హిట్ డ్రామా `కెన్ దిస్ ల‌వ్ బి ట్రాన్స్‌లేటెడ్` కంటే కూడా ఎక్కువ ఆద‌ర‌ణ‌గా ప‌రిగ‌ణించారు.

ఈ సినిమా కథాంశంలో ఎత్తుగ‌డ‌, నేపథ్యం చాలా ఆస‌క్తిక‌రం. నీరజ్ పాండే సృష్టించిన ఈ సిరీస్ విమానాశ్రయాల్లో జరిగే బంగారం స్మగ్లింగ్, కస్టమ్స్ అధికారుల సాహసాల నేపథ్యంలో సాగుతుంది. ఇందులో ఎమ్రాన్ హష్మీ కస్టమ్స్ అధికారిగా అద్భుతమైన నటన కనబరిచారు. ఈ సిరీస్ సాధించిన విజయంపై ఎమ్రాన్ హష్మీ స్పందిస్తూ, ఇది భారతీయ కథలకు ప్రపంచ స్థాయిలో దక్కిన గౌరవంగా పేర్కొన్నారు.

ఇటీవ‌లే ఓజీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పోటీప‌డుతూ న‌టించి మెప్పించిన ఇమ్రాన్ హ‌ష్మి త‌న కెరీర్ లో ఎన్నో విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో అద్బుత న‌టుడిగా నిరూపించాడు. అందుకే ఇప్పుడు ద‌క్షిణాదినా అత‌డికి వ‌రుస‌గా అవ‌కాశాలొస్తున్నాయి. ఇక్క‌డ విల‌న్ గా అత‌డికి మ‌రింత మంచి స్కోప్ క‌నిపిస్తోంది.

ఇమ్రాన్ హ‌ష్మి నెక్ట్స్ సినిమాలు?

అడివి శేష్ హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ `గూఢ‌చారి 2`లో ఇమ్రాన్ హష్మీ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది మే 1న పాన్ ఇండియాలో విడుద‌ల కానుంది. ఈ సినిమాతో ఇమ్రాన్ తన యాక్షన్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లనున్నారు. తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన ఆవారాపన్ కు సీక్వెల్ ఆవారాపాన్ 2లోను ఇమ్రాన్ హ‌ష్మి న‌టిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఏప్రిల్ 3న ఇది విడుద‌ల కానుంది. ఇందులో దిశా ప‌టానీ క‌థానాయిక‌. నితిన్ కక్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

భారీ యాక్షన్ `గన్ మాస్టర్ G9`లోను హ‌ష్మి న‌టిస్తున్నాడు. ఇందులో ఇమ్రాన్ హష్మీతో పాటు హిమేష్ రేషమ్మియా కూడా నటిస్తున్నారు. 2026 చివరలో విడుద‌ల‌కు రానుంది. హరామీ అనే క్రైమ్ డ్రామాలోను న‌టిస్తున్నాడు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన ఈ చిత్రం త్వరలోనే డిజిటల్ లేదా థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది.